అన్వేషించండి

Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?

TVK vs Rajini Fans: రజనీకాంత్ పై టీవీకే నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రజనీ ఫ్యాన్స్ అంతా కలిసి టీవీకేపై యుద్దం ప్రకటించారు.

Aadhav Arjuna comments on Rajinikanth create a stir:  విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం  పార్టీకి చెందిన ప్రముఖ నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార డీఎంకే , సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  

డీఎంకే బెదిరింపుల ఆరోపణ 

విజయ్ పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న ఆధవ్ అర్జున ఇటీవల ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి డీఎంకే ఇచ్చిన బెదిరింపులే కారణమని సంచలన ఆరోపణ చేశారు. రజనీకాంత్ రాజకీయ పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్న తరుణంలో, డీఎంకేకు చెందిన కీలక వ్యక్తులు ఆయనను భయభ్రాంతులకు గురిచేశారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని అర్జున పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నేరుగా అధికార పక్షంపై దాడి చేయడంతో పాటు రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉండటంతో దుమారం రేగింది.

 రజనీకాంత్ అభిమానుల ఆగ్రహం 

ఆధవ్ అర్జున చేసిన ఈ వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. రజనీకాంత్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదు, కేవలం తన ఆరోగ్య కారణాల దృష్ట్యా మాత్రమే రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని ఆయనే స్వయంగా ప్రకటించారు  అని వారు గుర్తు చేస్తున్నారు. రజనీకాంత్‌ను ఒక పిరికివాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు టీవీకే నేత తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

డీఎంకే స్పందన 

డీఎంకే నాయకత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమపై బురద చల్లడమే లక్ష్యంగా టీవీకే నేతలు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రజనీకాంత్ ,  ఎం.కె. స్టాలిన్ కుటుంబం మధ్య ఎప్పుడూ గౌరవప్రదమైన సంబంధాలే ఉన్నాయని, మధ్యలో మూడో వ్యక్తికి అనవసరమైన ఆరోపణలు చేసే హక్కు లేదని డీఎంకే నేతలు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉనికిని చాటుకోవడానికే టీవీకే ఇలాంటి వివాదాలను సృష్టిస్తోందని వారు విమర్శించారు.
 
టీవీకే అంతర్గత పరిణామాలు 

పార్టీ కార్యకర్తలలో,  ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతో టీవీకే నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. ఆధవ్ అర్జున చేసినవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని, పార్టీకి వాటితో సంబంధం లేదని కొందరు నేతలు సమర్థించుకుంటున్నప్పటికీ, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటంపై విజయ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ వివాదం కారణంగా రజనీకాంత్ అభిమానుల మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  


తమిళనాడులో అగ్ర హీరోలైన రజనీకాంత్ ,  విజయ్ అభిమానుల మధ్య ఎప్పుడూ ఒక రకమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్, రజనీ మద్దతును కూడగట్టుకోవాల్సింది పోయి, తన నేతల ద్వారా ఇలాంటి వివాదాలు కొనితెచ్చుకోవడం రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.           

   

 

 

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
IND vs AUS Test Series Schedule: 5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Embed widget