అన్వేషించండి

Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు

Visa Interview : చాలా మంది వీసా ఇంటర్వ్యూ గురించి భయపడతారు. కఠినమైన ప్రశ్నలు అడుగుతారని, చిన్న తప్పు వల్ల వీసా తిరస్కరిస్తారని భావిస్తారు. మరి దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వీసా ఇంటర్వ్యూలో మీ అప్లికేషన్ వివరాలను గుర్తుంచుకోండి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి.
  • విదేశీ ప్రయాణానికి ఇంగ్లీష్ సంభాషణ ప్రాక్టీస్ చేయండి.
  • తిరిగి వచ్చే ప్రణాళికలను స్పష్టంగా వివరించండి.

Common Visa Interview Questions : ఈ రోజుల్లో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలు.. విద్య, వృత్తి కోసం భారతీయ విద్యార్థులను, నిపుణులను ఆకర్షిస్తున్నాయి. మీరు అలా వెళ్లాలనుకుంటే.. కచ్చితంగా వీసా ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీసా ఇంటర్వ్యూ అనేది ఎవరైనా విదేశాలకు వెళ్లే ప్రక్రియలో ఒక ముఖ్యమైన దశ. మీరు చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నా.. ఉద్యోగం చేద్దామనుకున్నా..  ఆఖరికి విహారయాత్రకు వెళ్లాలనుకున్నా.. వీసా ఇంటర్వ్యూలో బాగా రాణించడం చాలా ముఖ్యం.

కానీ చాలా మంది ఈ ఇంటర్వ్యూ గురించి భయపడతారు. ఎందుకంటే అక్కడ కఠినమైన ప్రశ్నలు అడుగుతారని లేదా చిన్న తప్పు కారణంగా వీసా రిజెక్ట్ అవుతుందని భయపడతారు. కానీ మీరు సరిగ్గా ప్రిపేర్ అయి.. కాన్ఫిడెంట్​గా ఇంటర్వ్యూ ఇస్తే చాలు. వీసా పొందే అవకాశం చాలా పెరుగుతుంది. సింపుల్ చిట్కాలతో మీ ఆత్మవిశ్వాసాన్ని ఇట్టే పెంచుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో మెరుగ్గా సమాధానాలు ఇవ్వచ్చు. కాబట్టి వీసా ఇంటర్వ్యూ కోసం సిద్ధమయ్యేవారికి అవసరమయ్యే సులభమైన, ముఖ్యమైన చిట్కాలు ఇప్పుడు  తెలుసుకుందాం. 

వీసా ఇంటర్వ్యూ కోసం..

  • అప్లికేషన్‌ను బాగా అర్థం చేసుకోండి - వీసా ఇంటర్వ్యూలో.. అధికారులు తరచుగా మీ అప్లికేషన్ ఫారమ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి మీరు అప్లికేషన్‌లో నింపిన సమాచారాన్ని బాగా గుర్తుంచుకోండి. మీరు చదువు కోసం దరఖాస్తు చేసుకుంటే.. మీ విశ్వవిద్యాలయం, కోర్సు, భవిష్యత్ ప్రణాళికల గురించి స్పష్టమైన సమాచారాన్ని చెప్పండి. మీ సమాధానాలు చిన్నవిగా, స్పష్టంగా, నేరుగా అర్థమయ్యేలా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూ సాధారణంగా చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. 
  • అన్ని డాక్యుమెంట్‌లను సిద్ధం చేసుకోండి - వీసా ఇంటర్వ్యూ సమయంలో డాక్యుమెంట్లు చాలా అవసరం. మీ పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండాలి. దీనితో పాటు వీసా అప్లికేషన్ నిర్ధారణ, అపాయింట్‌మెంట్ లెటర్, ఫీజు రసీదును ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితిని చూపించే బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, శాలరీ స్లిప్‌లు లేదా విద్య రుసుములకు సంబంధించిన డాక్యుమెంట్‌లు కూడా అవసరం కావచ్చు. మీరు విద్యార్థి అయితే విశ్వవిద్యాలయం నుంచి ఎంట్రీ లెటర్ కూడా తీసుకోవాలి. 
  • ఇంగ్లీష్ మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి - విదేశాలలో ఇంగ్లీష్ ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూ సమయంలో ఇంగ్లీష్‌లో మాట్లాడటం మంచిది. మీరు ప్రతిరోజూ ఇంగ్లీష్ వార్తలు చూడవచ్చు. పుస్తకాలు చదవవచ్చు లేదా స్నేహితులతో ఇంగ్లీష్‌లో సంభాషణలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీంతో మీరు ఇంటర్వ్యూలో బాగా మాట్లాడగలరు.
  • రెగ్యులర్ క్వశ్చన్స్ - వీసా ఇంటర్వ్యూలో దాదాపు ప్రతి అభ్యర్థిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అంటే మీరు విదేశాలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? మీరు ఏ కోర్సు లేదా పని కోసం వెళుతున్నారు? మీ విద్య లేదా ప్రయాణానికి ఎవరు ఖర్చు భరిస్తారు? చదువు పూర్తయిన తర్వాత మీ ప్రణాళిక ఏమిటి? అనే ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు ఆలోచించండి. తద్వారా ఇంటర్వ్యూ సమయంలో మీరు భయపడకుండా సమాధానం చెప్పగలరు.
  • స్వదేశానికి సంబంధించిన సంబంధాలు - మీరు చదువు లేదా పని పూర్తయిన తర్వాత మీ దేశానికి తిరిగి వస్తారా లేదా అని వీసా అధికారి కూడా తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి మీరు మీ కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం లేదా ఆస్తి వంటి వాటి గురించి చెప్పాలి. ఇవి మిమ్మల్ని మీ దేశానికి కలుపుతాయి. ఇది అధికారికి మీ ఉద్దేశ్యం నిర్దేశిత ప్రయోజనం కోసం మాత్రమే విదేశాలకు వెళ్లడమేనని నమ్మకం కలిగిస్తుంది.
  • ఆత్మవిశ్వాసంతో ఉండండి - ఇంటర్వ్యూ కోసం సమయానికంటే ముందు వెళ్లండి. శుభ్రమైన, సాధారణ ఫార్మల్ దుస్తులు వేసుకోండి. ఇంటర్వ్యూ సమయంలో నవ్వుతూ మాట్లాడండి. కళ్ళలోకి చూసి సమాధానం చెప్పండి. అధికారి మాటలను జాగ్రత్తగా వినండి. 

ఈ విషయాలపై కనీస అవగాహన ఉంటూ.. ఇంగ్లీష్​లో కాన్ఫిడెంట్​గా సమాధానమిస్తే చాలు. మీరు ఈ వీసా ఇంటర్వ్యూ సింపుల్​గా పాస్​ అయిపోతారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget