అన్వేషించండి

Backburner Relationship : బ్యాక్​బర్నర్​ రిలేషన్​లో ఉన్నారా? అయితే వెంటనే ఫుల్​స్టాప్ పెట్టేయండి

New Dating Trend : మీరు బ్యాక్​ బర్నర్ రిలేషన్​షిప్​లో ఉన్నారా? అయితే మీరు ఇంకేమి ఆలోచనలు పెట్టుకోకుండా దానికి ఇప్పుడు చెక్​ పెట్టేయండి. ఎందుకంటే..

Realtionship Advices : ఈ జనరేషన్​లో ప్రేమని కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే వారానికొక డేటింగ్ పద్ధతి మార్కెట్​లోకి వస్తుంది. తమ కన్వినెంట్​కి తగ్గట్లుగా రిలేషన్​ షిప్​ని మార్చేసుకుంటున్నారు. లేదంటే కొత్త పద్ధతుల్లో ప్రేమించుకుంటున్నారు. కొన్ని డేటింగ్ పద్ధతులు రిలేషన్​ షిప్​ని కాపాడుతుంటే.. మరికొన్ని టైమ్​పాస్​ అనే పదానికి ఆల్ట్రనేటివ్​గా మారుతున్నాయి. కాలానికి తగ్గట్లుగా ఆధునికంగా మారొచ్చు కానీ.. సంబంధాల విషయంలో పూర్తి ఆధునికత ఉండకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. 

ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న రిలేషన్ షిప్​ ట్రెండ్​లలో బ్యాక్​ బర్నర్ రిలేషన్ ఒకటి. అంటే ఓ వ్యక్తి మీతో రిలేషన్​లో ఉంటూ.. మరో వ్యక్తితో శారీరకమైన, ఇతర ప్రయోజనాల కోసం రిలేషన్​లోకి వెళ్లడం అనమాట. మరింత వివరంగా చెప్పాలంటే.. ప్లాన్ ఏ వర్కవుట్ కాకపోతే ప్లాన్​ బికి లైన్​ క్లియర్ చేసుకుంటారు అనమాట. ఒకేసారి ఇద్దరితో రిలేషన్​షిప్ మెయింటైన్ చేయడం. పెళ్లి తర్వాత ఇలాంటివి చేస్తే అక్రమ సంబంధం అనేస్తారు. పెళ్లికి ముందు ఇలాంటి రిలేషన్​ షిప్ మెయింటైన్ చేస్తే బ్యాక్​బర్నర్​ రిలేషన్ అంటారు. 

ఉదాహరణకు ఓ వ్యక్తి తనకి గర్ల్​ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్తూనే.. మీతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు అనమాట. అనన్య పాండే హీరోయిన్​గా నటించిన కో గయే హమ్ కహా అనే సినిమా ఈ తరహా రిలేషన్​షిప్స్​ మీదనే సాగుతుంది. ఓ వ్యక్తి తమ లైఫ్​లో ఉండగా.. మరో వ్యక్తితో శృంగార, ప్రేమ, ఇష్టాలు కలిశాయి అంటూ రిలేషన్​షిప్స్​ పెట్టుకుని.. తమతో ఉన్నవారిని బాధపెడుతూ ఉంటారు. 

మీరు ఇలాంటి రిలేషన్​లో ఉన్నా.. మీరు ఏ రిలేషన్​లో అయినా మూడో వ్యక్తిగా ఉన్నా.. లేదంటే ఇలాంటి రిలేషన్​ కోసం ఎదురు చూస్తున్నా వెంటనే దానికి ఫుల్​స్టాప్ పెట్టేయండి. ఎందుకంటే నిజమైన ప్రేమ దొరకాలంటే.. ఇప్పట్లో చాలా కష్టం. ఇప్పుడనే కాదు.. గతంలో కూడా నిజమైన ప్రేమ దొరకని వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే ఒకరు మిమ్మల్ని ఇష్టపడుతూ.. మీతో నిజాయితీగా ఉంటూ.. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటే మీరు ఇంకొకరితో రిలేషన్​షిప్ పెట్టుకోవాలనుకోవడం చాలా మూర్ఖమైన పని. మీరు ఓ వ్యక్తిని ప్రేమించినా.. ప్రేమించకపోయినా మీ లైఫ్​లో ఒకరు ఉంటే మాత్రం మూడో వ్యక్తి వైపు ఆకర్షితులవడం ఎంత మాత్రము హేయము కాదు అంటున్నారు నిపుణులు. 

ప్రధాన కారణం అదే..

కొందరు ఏంటంటే ఓ వ్యక్తితో ప్రేమలో పడిపోయి.. వారితో రిలేషన్​లో ఉన్నప్పుడు బోర్​గా ఫీల్​ అవుతారు. అలాంటివారు మరో వ్యక్తివైపు ఈజీగా ఆకర్షితులైపోతారు. ప్రధానంగా ఈ కారణం వల్లే చాలామంది బ్యాక్​బర్నర్​ రిలేషన్​లోకి వెళ్తున్నారని నిపుణులు చెప్తున్నారు. మీరు ఓ రిలేషన్​లో ఉన్నప్పుడు మీ పార్టనర్​కి కట్టుబడి ఉండేలా చూసుకోండి. లేదంటే వారితో కూర్చొని ఏదోక విషయం తేల్చుకోండి. అలా కాకుండా వారితో ఉంటూనే మీరు మరొకరితో సంబంధం పెట్టుకుంటే మీరు ఒకేసారి ఇద్దరిని చీట్​ చేసిన వారు అవుతారు. 

బ్యాక్​ బర్నర్​ రిలేషన్​ అనేది ఓ ఫాంటసీ ప్రపంచం లాంటిది. ఇది మీ రిలేషన్​ని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. సంబంధాల విషయంలో ముందుకు వెళ్లకుండా చేస్తుంది. మీ సమయాన్ని వృథా చేసి.. ఓ ఊబిలో చిక్కుకుపోయే పరిస్థితికి తీసుకువస్తుంది. ఓ వ్యక్తితో మీరు రిలేషన్​లో ఉంటూ ఇంకో వ్యక్తిపై మనసు పడడం కరెక్ట్ కాదు. అలాగే రిలేషన్​లో ఉన్న వ్యక్తిపై ఉన్న అభిమానాన్ని ప్రేమ అనుకుని వారి మధ్య వెళ్లడం అస్సలు మంచిది. మీ పార్టనర్​ మీతో రిలేషన్​లో ఉంటూ.. వేరే వారితో ఇతర సంబంధాలు పెట్టుకుంటే మీరు వెంటనే మీ రిలేషన్​లో ఏదొక నిర్ణయం తీసుకోవడం మంచిది. లేదంటే అది టాక్సిక్​గా మారి అనర్థాలకు దారి తీస్తుంది. 

Alos Read : 2024లో న్యూ డేటింగ్ ట్రెండ్.. రిస్క్​ లేకుండా ఈ రిలేషన్​షిప్​ ఏదో బానే ఉందిగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలుMS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు -  మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Embed widget