అన్వేషించండి

NATO Dating : 2024లో న్యూ డేటింగ్ ట్రెండ్.. రిస్క్​ లేకుండా ఈ రిలేషన్​షిప్​ ఏదో బానే ఉందిగా

Gen Z Dating Trend 2024 : రిలేషన్స్​కి అర్థాలు మార్చడంలో Gen-Z కిడ్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తీసుకొచ్చిన ఓ డేటింగ్ ట్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్​గా ఉంది.

NATO Dating Trend : క్లిష్టమైన సమస్యలకు కూడా సింపుల్ సొలుష్యూన్స్​ వెతుక్కోవడంలో Gen-Z కిడ్స్ ఎప్పుడూ ముందుగానే ఉంటారు. ఇలా అన్ని విషయాల్లో తమ మార్క్​ని చూపిస్తూ ఉంటారు. వాటి వల్ల మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా అనేది పక్కన పెడితే.. వారిలోని క్రియేటివిటీకి మాత్రం మెచ్చుకోక తప్పదు. చేసే అన్ని పనుల్లోనూ కొత్త విధానాలు పాటించే Gen-Z కిడ్స్ రిలేషన్స్​లో కూడా వాటిని అమలు చేస్తున్నారు. రిలేషన్స్​తో ఇబ్బంది పడే మిలీనియల్స్​ కంటే.. కొత్త పరిష్కారాలతో హ్యాపీగా రిలేషన్స్​ని ముందుకు తీసుకెళ్లడంలో Gen-Z కిడ్స్ ఓ అడుగు ముందే ఉన్నారని చెప్పాలి. తమకి కన్వినెంట్​గా కొత్త కొత్త డేటింగ్స్​ను తెరపైకి తీసుకొస్తున్నారు. 

న్యూ డేటింగ్ ట్రెండ్

రిలేషన్స్​కి సంబంధించి Gen-Z కిడ్స్ ఎన్నో డేటింగ్ ట్రెండ్స్​ తీసుకొచ్చారు. అయితే 2024లో ఓ Gen-Z డేటింగ్ ట్రెండ్ బాగా వైరల్ అవుతుంది. అదే నాటో డేటింగ్. NATO అర్థం ఏమిటంటే Not Attached To An Outcome. అంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే చింత లేకుండా ప్రస్తుత క్షణాన్ని హాయిగా ఆస్వాదించడం. ఎవరైనా రిలేషన్​లోకి వెళ్తే అమ్మో మా ఇంట్లో ఒప్పుకోరేమో.. అలా జరుగుతుందేమో.. ఇలా అవుతుందేమో అని ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు. అలాంటి భయాలు లేకుండా ఉన్న క్షణాన్ని హ్యాపీగా గడుపుదాము. ఫ్యూచర్​ని తలచుకుంటూ హ్యాపీ మూమెంట్స్​ని వదులుకోకూడదనే విధానాన్ని ఈ NATO డేటింగ్ సూచిస్తుంది. 

ఎలాంటి ఒత్తిడి లేకుండా

కొత్తగా వచ్చిన ఈ NATO డేటింగ్​ వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చు.  ముందు చూపు ఉండాలి దేనికైనా అనే వాటికి నో చెప్తూ.. ఉన్న సమయాన్ని హ్యాపీగా నచ్చినవారితో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తుంది ఈ ట్రెండ్. ఈ కాలంలో ఒత్తిడి అనేది దాదాపు అందరూ ఎదుర్కొంటున్న సమస్య. కాబట్టి రిలేషన్​లో ఎలాంటి ఒత్తిడి లేకుండా Live in the Moment తరహాలో NATO డేటింగ్​కు వెల్​కమ్ చెప్తున్నారు. 

ఇప్పటివరకు ఉన్న డేటింగ్ ట్రెండ్స్​లలో ఇది కాస్త భిన్నంగానే ఉంది. ఎందుకంటే ఈ డేటింగ్​లోకి వెళ్లాలంటే ఇద్దరికీ అదే రేంజ్​లో మెచ్యూరిటీ ఉండాలి. అప్పుడే ఫ్యూచర్​ గురించి ఫికర్​ కాకుండా.. తమ రిలేషన్​ని ఎంజాయ్ చేయగలుగుతారు. లేదంటే ఫ్యూచర్​ని తలచుకుంటూ.. ఇంట్లో ఒప్పుకోరు అనుకుంటూ.. నచ్చినవారిని వదులుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ జెనరేషన్​లో చాలామంది లవ్​ మ్యారేజ్​లకు, రిలేషన్​లకు సపోర్ట్ చేస్తున్నారు. అదే తరహాలో కొందరు వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ఒత్తిడి పెంచుకోవడమో.. ఇంట్లో చెప్పకుండా ప్రాణాలు తీసుకోవడమో జరుగుతున్నాయి. ఆ టైమ్​ వస్తే జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడెందుకు దాని గురించి ఆలోచించి.. ఉన్న టైమ్​ని సంతోషంగా గడపకుండా ఉండాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఇలాంటి ట్రెండ్స్ తెరపైకి వస్తుంటాయి. 

ఈ ట్రెండ్ ఏమి లస్ట్​తో కూడుకున్నది కూడా కాదు. రోటీన్ లవర్స్​లానే ఉంటారు కానీ.. కేవలం చివరికి ఏమవుతుందనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా తమ పార్టనర్​తో ప్రేమను పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఎటువంటి ఒత్తిడి లేకుండా వ్యక్తిగత ఎదుగదలకు కూడా ప్రాధన్యత ఇవ్వడం జరుగుతుంది. ముందుగానే మాట్లాడుకోవడం వల్ల ఒకరి జీవితంలో ఏమి జరిగినా అది ఇంకో వ్యక్తి ఎలాంటి నష్టం కలిగించదు. కాబట్టి ఈ NATO డేటింగ్ ట్రెండ్​ని చాలామంది ఆహ్వానిస్తున్నారు. ఇది రిలేషన్​కు మంచి నాణ్యత ఇస్తుందని భావిస్తున్నారు. 

Also Read : మార్కెట్​లోకి కొత్త రిలేషన్​ షిప్​.. దానిపేరే హాలిడే డేటింగ్  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Embed widget