అన్వేషించండి

Home Fire Safety Tips : ఇంట్లో మంటలు అంటుకుంటే ఏమి చేయాలి? వేసవిలో తప్పక తెలుసుకోవాల్సిన ఫైర్ సేఫ్టీ టిప్స్

Home Fire Safety Tips : ఇంట్లో అగ్ని ప్రమాదం ఎప్పుడైనా సంభవించవచ్చు. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలా అనుకోని ప్రమాదం ఎదురైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం. 

Saftey Tips During a Home Fire : వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. పరిశ్రమల్లోనే కాదు ఇళ్లల్లో, అపార్ట్మెంట్స్​లో కూడా వివిధ కారణాల వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ సంభవిస్తాయి. గ్యాస్ లీకేజ్, షార్ట్ సర్క్యూట్, కరెంట్ పోవడం వల్ల వెలిగించే కొవ్వొత్తులు, స్టవ్ వంటి కారణాల వల్ల కూడా మంటలు చెలరేగుతాయి. అలాంటి సమయంలో భయపడకుండా సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ సమయంలో చాకచక్యంగా ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం దూరం చేసుకోవచ్చు. 

అలారం ప్రెస్ చేయండి..

మీరు అపార్ట్​మెంట్స్​లో ఉంటే పొరుగువారికి తెలిసేలా అలారం ప్రెస్ చేయాలి. దీంతో వారు అప్రమత్తం అవుతారు. 

మెయిన్ పవర్ ఆఫ్ చేయండి..

సురక్షితంగా ఉంటే వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు పెరగకుండా కాపాడుతుంది. లేదా ప్రమాదం ఎక్కువ అవుతుంది.

గ్యాస్ సిలిండర్

గ్యాస్ లీకేజ్ అనుమానం ఉంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. గ్యాస్ దగ్గర మంటలు ఉంటే నీళ్లు పోయొద్దు. దీనివల్ల మంటలు ఎక్కువ అవుతాయి. తడి గుడ్డను దానిపై కప్పడం వల్ల ప్రమాదం తగ్గుతుంది.

చిన్న మంటలు అయితే..

ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉంటే దానిని ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకురావచ్చు. లేకపోతే మందమైన దుప్పటి లేదా ఇసుకతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలి. అన్ని సందర్భాల్లో నీళ్లు ఉపయోగించకూడదు.

పొగ ఎక్కువగా ఉంటే

అగ్ని ప్రమాదం నుంచి బయటపడాల్సి వచ్చినప్పుడు పొగ ఎక్కువగా ఉంటే నిల్చొని బయటకు పరుగెత్తడం మంచిది కాదు. కిందకి వంగి లేదా క్రాల్ చేస్తూ బయటికి వెళ్లాలి. ఎందుకంటే పొగ ఎక్కువగా పైకి చేరుతుంది. దీనివల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

బయటకు వెళ్లండి

ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలివేటర్ వాడకపోవడమే మంచిది. ఆ సమయంలో మెట్లు ఉపయోగించాలి. అందరూ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఇతర చర్యలు తీసుకోవాలి.

ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేయండి

అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ సర్వీస్‌కు సమాచారం ఇవ్వాలి (101). సిబ్బంది వచ్చేలోపు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

పిల్లలకు ఫైర్ సేఫ్టీ గురించి ముందుగానే అలెర్ట్ ఇవ్వండి. ఇంట్లో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ తప్పనిసరిగా ఉంచండి. వైర్లు, గ్యాస్ పైపులు తరచూ చెక్ చేయండి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఉండదు. ప్రమాద సమయంలో భయపడకుండా, సరిగ్గా స్పందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget