మ్యారేజ్ లైఫ్​లో రొమాన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందట. అది ఉంటే రిలేషన్​లో ఇద్దరూ హ్యాపీగా ఉంటారట.

రొమాన్స్ అంటే శృంగారం కాదని గుర్తించుకోవాలి. ఇది తెలియక చాలామంది లైంగికంగా ఉండేందుకు చూస్తారు.

పార్టనర్​కి దగ్గరగా ఉంటూ.. హగ్స్, కిస్, ఇతర సంకేతాల ద్వారా ప్రేమని పంచడమే రొమాన్స్.

పెళ్లి అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల వైఫ్ అండ్ హజ్బెండ్ రిలేషన్​ మెకానికల్​గా మారుతుంది.

దీనివల్ల వారి మధ్య శారీరక సంబంధం ఉన్నా రొమాన్స్ మాత్రం తగ్గుతుంది. ఇదే వారి మధ్య దూరాన్ని పెంచుతుందట.

పార్టనర్​కి దగ్గరగా ఉంటూ.. రొమాంటిక్ లైఫ్​ని లీడ్ చేస్తే మ్యారేజ్​ లైఫ్​ ఫ్రెష్​గా, కొత్తగా ఉంటుందట.

పైగా రొమాన్స్ అనేది ఇద్దరి మధ్య బాండ్​ని పెంచడంలో హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు.

డేట్​కి వెళ్లడం, రొమాంటిక్ డిన్నర్స్, క్యూట్ సర్​ప్రైజ్​లు ఇవ్వడం కూడా రొమాన్స్​ కిందకే వస్తాయి.

పార్టనర్​కి సమయాన్ని కేటాయించడం.. వారితో దగ్గరగా కూర్చొని మాట్లాడడం కూడా ఓ తరహా రొమాన్సే.

కేవలం రొమాన్స్ వల్లనే మ్యారేజ్ లైఫ్ సక్సెస్​ కాకపోవచ్చు. కానీ.. ఇది మేజర్​ రోల్ ప్లే చేస్తుందని గుర్తించుకోవాలి.