టాటూను కొందరు ఇష్టంతో, మరికొందరు ఫ్యాషన్​ కోసం వేయించుకుంటారు.

అయితే కొందరికి టాటూ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్నారు నిపుణులు.

కొత్త సూదులు ఉపయోగించకున్నా.. టాటూ తర్వాత సరిగ్గా కేర్ తీసుకోకున్నా ఇన్​ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది.

రెడ్​గా అవ్వడం, వాపు రావడం, ఫీవర్ వంటి లక్షణాలుంటే వైద్య సహాయం తీసుకుంటే మంచిది.

కొన్ని రకాల టాటూ రంగులు.. ఎరుపు, గ్రీన్, ఎల్లో, బ్లూ కలర్ రంగులు అలెర్జీని కలిగిస్తాయి.

దురద రావడం, ర్యాష్, బంప్స్.. వంటి రియాక్షన్ వెంటనే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా రావొచ్చు.

స్కిన్​ ఇన్​ఫ్లమేషన్, స్కిన్ ఇరిటేషన్ వస్తే వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లాలి. ఎగ్జిమా వచ్చే అవకాశముంది.

సరైన పరికరాలు ఉపయోగించకపోతే హెపటైటిస్ బి లేదా, హెచ్​ఐవీ, ఎయిడ్స్ రావొచ్చు.

కొన్నిరకాల టాటూలు.. MRI స్కాన్స్ చేసినప్పుడు బర్నింగ్ ఫీలింగ్​ని ఇస్తాయి.

మీరు టాటూ వేయించుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.