Age-Gap Relationships : మీకంటే వయసు చాలా ఎక్కువ ఉన్నవారిని పెళ్లి చేసుకుంటే .. లాభాలేంటి? నష్టాలేంటి? రిలేషన్ సక్సెస్ అవుతుందా?
Exploring Age-Gap Relationships : పెళ్లి చేసుకున్న తర్వాత పార్టనర్‌కు మీకు ఏజ్ గ్యాప్ ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? బెటర్ అనిపించే విషయాలు ఏంటి? ఈ రిలేషన్ వర్క్ అవుతుందా? లేదా?

Relationships With Huge Age Gap : లవ్ మ్యారేజ్ అయితే పర్లేదు కానీ.. దాదాపు పెద్దలు కుదిర్చి చేసిన వివాహాల్లో భర్త వయసు భార్య కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ గ్యాప్ కాస్త తగ్గినా.. కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అలాగే ముందుతరంలో ఈ తరహా పెళ్లిల్లు ఎక్కువగా జరిగేవి. దాదాపు దశాబ్ధం (పదేళ్లు.. ఆపైగా) గ్యాప్ ఉన్న కపుల్స్ కూడా ఉండేవారు. కొందరు సెలబ్రెటీలు కూడా ఈ ఏజ్ గ్యాప్‌ని పూర్తిగా వెల్కమ్ చెప్తున్నారు. అయితే భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే మంచిదా? చెడ్డదా?
పార్టనర్‌కి వయసు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానంగా కొన్ని డిఫరెన్స్‌లు ఉంటాయి. ఇద్దరికీ ప్రత్యేకమైన అనుభవాలు, సవాళ్లు ఉంటాయి. లైఫ్‌స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. కెరీర్‌పై భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇలాంటివారు కలిసి లైఫ్‌ని లీడ్ చేయడమంటే మంచిదా? చెడ్డదా? సాధారణంగా భార్య భర్తల మధ్య 3 సంవత్సరాల వయసు తేడా అనేది మంచిదిగా చెప్తారు. కానీ 10 ఏళ్లు వయసు తేడా ఉంటే దానివల్ల కలిగే లాభ, నష్టాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
లాభాలు..
ఈ తరహా మ్యారేజ్ చేసుకున్నప్పుడు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వయసులో పెద్ద అయినవారికి వారు ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల మెచ్యూరిటీ బాగుంటుంది. రిలేషన్లో స్టేబుల్‌గా ఉండే అవకాశం ఎక్కువ. లైఫ్‌లో మీకంటే ఎక్కువ జీవితాన్ని చూసి ఉంటారు కాబట్టి.. వారి ఎక్స్పీరియన్స్ లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లడానికి సరిపోతుంది. ఆర్థికంగా సెటిల్ అయ్యే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సెక్యూర్‌గా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఫ్యూచర్లో డబ్బుపరంగా ఇబ్బందులు రావు. గొడవను పెద్దగా కాకుండా తమ కమ్యూనికేషన్స్ స్కిల్స్‌తో మీకు సర్ది చెప్పి.. వారూ సర్దుకుపోతారు.
ఇబ్బందులివే..
ఏ తరహా పెళ్లి అయినా జంట మధ్యలో ఇబ్బందులు ఉండడం కామన్. మరి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. వయసులో పెద్దవారు చిన్న అనేభావంతో అర్థం చేసుకోకుండా.. అన్ని నాకే తెలుసు అనే ధోరణిలో ఈజీగా జడ్జ్ చేసే అవకాశముంది. ఈ తరహా లక్షణం బంధంలో చిచ్చులు పెడుతుంది. అలాగే లైఫ్‌స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒకరు సాంప్రదాయాలకు విలువనిస్తే.. మరొకరు ట్రెండ్‌ని ఫాలో అయ్యేవారు ఉండొచ్చు.
వయసులో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. త్వరగా రావొచ్చు కూడా. అది సంబంధాన్ని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ప్రభావితం చేయవచ్చు. చిన్నవారికి సోషల్ మీడియా అలవాటు ఉంటే.. ఆ ట్రెండ్స్, ఆ మాటలు మీకు అర్థమవ్వడం కష్టంగా ఉంటుంది.
సక్సెస్ మంత్ర
ఏ రిలేషన్లో అయినా కాస్త ఎఫర్ట్స్ పెడితే దానిని సక్సెస్ చేసుకోవచ్చు. ఏజ్ గ్యాప్ ఉన్నా.. హాయిగా ఉండే ఎందరో కపుల్స్ మన కళ్లముందు ఉన్నారు. వారు తమ బంధాన్ని సక్సెస్ చేసుకోవాడికి ముఖ్యమైన కారణం కమ్యూనికేషనే. ఇద్దరు ఓపెన్‌గా మాట్లాడుకుంటే సగానికి పైగా సమస్యలు తీరిపోతాయి. అలాగే ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తే చాలు. ఇద్దరికీ ఉండే కామన్ ఇంట్రెస్ట్లపై ఫోకస్ చేయొచ్చు. అవి బాండింగ్ పెంచడంలో హెల్ప్ చేస్తాయి. ఓపికగా.. అర్థం చేసుకునే పార్టనర్ ఉంటే.. ఎలాంటి సంబంధం అయినా సంతోషంగా ఉంటుంది.
Also Read : ప్రశాంతంగా ఉండాలంటే ఆ ఆలోచనలు వదిలేయండి.. మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం బ్రో
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

