అన్వేషించండి

Holi 2026 : హోలీ ఆడక ముందు, ఆడిన తర్వాత ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రంగులు సులభంగా వదిలిపోతాయి, స్కిన్ డ్యామేజ్ కాదు

Holi 2026 Special : స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే రంగులతో ఆడే ముందు-తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి.

Before & After Holi Care : హోలీ ఆడినప్పుడు కొన్ని రంగులు జుట్టు, చర్మానికి అంటుకుపోతాయి. వాటిని వదిలించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ ఇబ్బంది లేకుండా.. సంతోషంగా హోలీ ఆడుకోవాలనుకుంటే.. రంగులు పూసుకునే ముందు.. తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్​గా రంగులును వదిలించేస్తాయి. 

హోలీ ఆడటానికి ముందు..

హోలీ ఆడటానికి ముందే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలావరకు డ్యామేజ్ అడ్డుకోవచ్చు. హోలీ ఆడటానికి ముందు ముఖం, చేతులు, శరీరానికి నూనెను ఎక్కువగా పూయండి. ఈ నూనె చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పాటు చేస్తుంది. రంగులు నేరుగా శరీరంలోనికి చొచ్చుకుపోకుండా ఆపుతుంది. వీలైతే మీ జుట్టుకు కూడా నూనె రాయండి. ఇది రంగులు స్కాల్ప్​పై పేరుకుపోకుండా ఆపుతుంది. పైగా వాటిని కడగడం చాలా సులభం అవుతుంది. చర్మానికి హాని లేకుండా కలర్స్ తొలగించేందుకు ఇది సులభమైన మార్గం. 

హోలీ తర్వాత.. 

హోలీ ఆడిన తర్వాత కూడా రంగు మిగిలి ఉంటే.. పెరుగు, నిమ్మకాయ మిశ్రమం మంచి నివారణ అవుతుంది. ఒక గిన్నెలో పెరుగు తీసుకొని కొద్దిగా నిమ్మరసం కలపండి. బాగా గిలక్కొట్టి ముఖం, శరీరానికి సున్నితంగా అప్లై చేయండి. 5-10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. పెరుగు చర్మాన్ని చల్లబరిచి తేమను ఇస్తుంది. నిమ్మకాయ మరకలను తొలగిస్తుంది. దీని తర్వాత ఫేస్ వాష్ లేదా క్రీమ్ అప్లై చేయండి. దీంతో చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తలపై రంగు పడినట్లయితే.. పెరుగును నేరుగా వేళ్లతో స్కాల్ప్​కి అప్లై చేసి.. కాసేపు అలాగే ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో కడిగేయండి. రంగు సులభంగా పోతుంది. జుట్టు మృదువుగా ఉంటుంది. 

శనగపిండి, పసుపుతో..

కలర్స్ వల్ల చర్మం రంగు మారితే శనగపిండి నలుగు ప్రభావవంతంగా ఉంటుంది. కొబ్బరి నూనె లేదా ఆవ నూనెను అప్లై చేసి తేలికగా మసాజ్ చేయండి. దానిని 10 నిమిషాలు అలాగే ఉంచి.. 3 టీస్పూన్ల శనగపిండిలో 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేయండి. ఉబ్తాన్ ముఖం, చేతులకు అప్లై చేసి కొద్దిసేపు అలాగే ఉంచండి. తరువాత నిమ్మ తొక్కతో తేలికగా రుద్దండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా రంగు మిగిలి ఉంటే మళ్ళీ అప్లై చేయండి. 

శనగపిండి, పచ్చిపాలు

మీరు నిమ్మకాయ ఉపయోగించకూడదనుకుంటే.. ఈ పద్ధతి కూడా సులభమే. అలాగే ఎఫెక్టివ్​గా ఉంటుంది. శనగపిండిని పచ్చి పాలు, ఆవ నూనె, పసుపుతో కలిపి ముఖానికి అప్లై చేసి ఆరనివ్వండి. స్క్రబ్ ఆరిన తర్వాత.. దానిని సున్నితంగా స్క్రబ్ చేయండి. రంగు సులభంగా పోతుంది. టానింగ్ కూడా తొలగిపోతుంది. 

ఈ టిప్స్ కచ్చితంగా చర్మంపై పేరుకుపోయిన రంగులను తొలగించండంతో పాటు.. టానింగ్​ను దూరం చేస్తాయి. అలాగే రంగుల వల్ల ఏర్పడే పొడిచర్మాన్ని దూరం చేస్తాయి. ఇంట్లోనే ఈజీగా ఫాలో అవ్వగలిగే ఈ టిప్స్ మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget