హోలీ ఆడేప్పుడు పిల్లలు, పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

అనుమతి లేకుండా ఎవరికి రంగులు పూయకూడదు.

కెమికల్స్ ఉన్న రంగులను ఉపయోగించవద్దు. సహజమైనవి ఎంచుకుంటే మంచిది.

నీటి బెలూన్లతో హోలీ ఆడకండి. ఇతరులకు అవి హానికరం కావచ్చు.

హోలీ పేరుతో అసభ్యంగా ప్రవర్తించడం నేరం. చట్టపరమైన చర్యలు తప్పవు.

మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. లేదంటే గొడవలు జరగవచ్చు.

రంగుల్లోని రసాయనాలు జంతువుల చర్మానికి, కళ్లకు హాని కలిగిస్తాయి.

బురద, మురుగు నీటితో హోలీ ఆడకూడదు. ఇలా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ వాడితే రంగులు తేలికగా తొలగిపోతాయి.

రోడ్లపై, ట్రాఫిక్ మధ్యలో హోలీ ఆడటం చట్టరీత్యా తప్పు.

పిల్లలు హోలీ ఆడేప్పుడు పెద్దల పర్యవేక్షణ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.