కొత్తగా పెళ్లైనవారు తమ పార్టనర్​తో కెమిస్ట్రీని పెంచుకోవాలనుకుంటే ఈ టిప్స్​ని ఫాలో అవ్వొచ్చు.

మీరిద్దరూ కలిసి ఉండేందుకు డేట్ నైట్స్​ని షెడ్యూల్ చేసుకోండి. దీనికోసం ఇద్దరూ టైమ్ కేటాయించుకోవాలి.

పార్టనర్ ఆలోచనలు, ఫీలింగ్స్​ ఎక్స్​ప్రెస్ చేస్తున్నప్పుడు వినండి. అర్థం చేసుకోవాడనికి ప్రయత్నించండి.

ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోండి. చిన్న విషయాలను మీరిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు.

కేవలం ఫిజికల్ రొమాన్సే కాదు.. ఎమోషనల్​ బాండింగ్ కూడా ఇద్దరి మధ్య ఉండేలా ప్లాన్ చేసుకోండి.

పార్టనర్​తో ఓపెన్​గా, నిజాయితీగా ఉంటే ఫ్యూచర్​లో ఎలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి మీ ఫీలింగ్స్, కోరికలు చెప్పండి.

ఇద్దరూ కలిసి చేయగలిగే హాబీలను రొటీన్​గా మార్చుకోండి. లేదా ఇద్దరూ కలిసి వంట చేసుకున్నా మంచిదే.

చేతులు పట్టుకోవడం, హగ్స్, కిస్ వంటివి ఫిజికల్​గా ఎఫెక్షన్​ని పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

మీ ఫ్యూచర్​ గురించి ప్లాన్స్ వేసుకుండి. ఇద్దరూ కలిసి వాటిని ఎలా రీచ్​ అవ్వాలో ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి.

కొత్తలో ఇద్దరి మధ్య అపార్థాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి.. క్షమించడం, అర్థం చేసుకోవడం వంటివి జరగాలి.

సర్​ప్రైజ్​ ప్లాన్ చేయడం, గిఫ్ట్​లు ఇచ్చుకోవడం కూడా మంచిదే.