గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ పరీక్షలపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా అని జగన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్!
Lokesh vs Jagan:ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, డీఎస్సీ పరీక్షల చుట్టూ రాజకీయ సమరం నడుస్తోంది. వైఎస్ జగన్ సీబీఐ విచారణ సిద్ధమా అంటూ చేసిన సవాల్‌కు నారా లోకేష్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

- వైఎస్ జగన్ గ్రూప్-1, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు సవాల్.
- తమ హయాంలో ఉద్యోగ నియామకాలు పారదర్శకమని జగన్ స్పష్టం చేశారు.
- నారా లోకేష్ జగన్ అజ్ఞానంపై మండిపడుతూ ధీటుగా కౌంటర్ ఇచ్చారు.
- జగన్ ఐదేళ్లలో డీఎస్సీ నిర్వహించలేదని లోకేష్ తీవ్రంగా ఆరోపించారు.
Nara Lokesh vs YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య గ్రూప్ 1, డీఎస్సీ వివాదంలో మరోసారి సవాళ్ల పర్వం నడుస్తోంది. తమ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పరీక్షలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సవాల్ చేశారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ రెడీనా అంటూ ప్రశ్నించారు. దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంతే దీటుగా కౌంటర్ ఇచ్చి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఏపీపీఎస్సీ గ్రూప్ -1 వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు ఆయన బహిరంగ సవాల్ చేశారు. తన హయాంలో నిర్వహించిన గ్రూప్ 1పై గత ఏడాది నిర్వహించిన డీఎస్సీపై సీబీఐ విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు.
" మా హయాంలో అత్యంత పారదర్శకంగా విప్లవాత్మక సంస్కరణలతో ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా లక్షా 30 వేల ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించిన ఘనత మా ప్రభుత్వానిది. అంతేకాకుండా, వివిధ విభాగాల్లో 78 నోటిఫికేషన్ల ద్వారా 6, 296 ఉద్యోగాలను భర్తీ చేశాం. ఈ నియామకాలన్నింటిలోనూ ఒక్కంటే ఒక్క అవినీతి ఆరోపణల కూడా రాలేదు." అని వైఎస్ జగన్ అన్నారు.
2018 నాటి గ్రూప్ -1 నియామక ప్రక్రియపై సిట్ విచారణ జరిపించినా ఏమీ తేలలేదని, అయినా సరే దీనిపై సీబీఐ దర్యాప్తునకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నాని చెప్పారు. మరి ఇదే ధైర్యంతో కూటమి ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ పరీక్షలపై సీబీఐ విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉందా అని చంద్రబాబు, లోకేష్‌ను ప్రశ్నించారు. ' మేం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే తల ఎత్తుకుని విచారణను కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం కూడా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలి" అని జగన్ డిమాండ్ చేశారు.
మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
వైఎస్ జగన్ చేసిన ఆరోపణపై విసిరిన సవాళ్లపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ' ఏపీపీఎస్సీ అంటే ఏంటీ? డీఎస్సీ అంటే ఏంటీ? అనే కనీస అవగాహన కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేదు. ఈ రెండు వేర్వేరు పరీక్షలని, వీటి విధి విధానాలు వేరని తెలియకుండా రెండింటినీ ఒకే గాటన కట్టి మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏయే పరీక్షలను ఏయే పద్ధతుల్లో నిర్వహిస్తుందో కూడా తెలియని వ్యక్తి మన రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు పాలించడం మన దౌర్భాగ్యం" అని లోకేష్ ఎద్దేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల ముఖ్యమంత్రి పాలన కాలంలో రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఒక్కటంటే ఒక్క డీఎస్సీ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారని లోకేష్ ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న జగన్‌కు ఈరోజు డీఎస్సీ నియామకాలపై మాట్లాడే అర్హత ఎంతమాత్రం లేదని కొట్టిపారేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ, ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిపేందుకు సిద్దం కావాలని సవాల్ విసిరితే, అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోయారని లోకేష్ ఎద్దేవా చేశారు. సభలో ఎదుర్కొనే ధైర్యం లేకనే బయట ప్రెస్‌మీట్ పెట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Frequently Asked Questions
జగన్ గారు ఏ పరీక్షలపై సీబీఐ విచారణకు ప్రస్తుత ప్రభుత్వానికి సవాల్ చేశారు?
వై.ఎస్.జగన్ తన హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై ఏ విచారణకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు?
తన హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని జగన్ సవాల్ చేశారు. 2018 నాటి గ్రూప్-1 నియామక ప్రక్రియపై సిట్ విచారణ జరిపినా ఏమీ తేలలేదని ఆయన పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జగన్ చేసిన ఆరోపణలపై ఎలా స్పందించారు?
ఏపీపీఎస్సీ, డీఎస్సీలపై జగన్‌కు కనీస అవగాహన లేదని లోకేష్ విమర్శించారు. ఆయన ఐదేళ్ల పాలనలో డీఎస్సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించలేదని లోకేష్ ఆరోపించారు.
జగన్ తన ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల గురించి ఏమి చెప్పారు?
తన హయాంలో అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని జగన్ అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల ఉద్యోగాలు కల్పించామని ఆయన తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు





















