అన్వేషించండి

YS Jagan On DSC 2025: "డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

YS Jagan On DSC: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని తాము ఆరోపించడమే కాదని, ప్రభుత్వం కూడా అంగీకరించిదని వైఎస్ జగన్ అన్నారు. అందుకే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మెగా డీఎస్సీ అక్రమాలు అంగీకరించినందున సీబీఐ విచారణకు డిమాండ్.
  • విద్యామంత్రి లోకేష్ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలి.
  • ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ ఒకే అధికారికి అప్పగించడాన్ని ప్రశ్నించారు.
  • ప్రతిపక్ష హోదా నిరాకరణ అక్రమాలను దాచడానికేనని జగన్ అన్నారు.

YS Jagan On DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన మెగా డీఎస్సీ 2025లో అనేక అక్రమాలు జరిగాయని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి ఆరోపించారు. దీనిపై మండలిలో ప్రభుత్వం చర్చ పెట్టకుండా శాసనసభలో చర్చ పెట్టడాన్ని తప్పు పట్టారు. అయితే అక్కడ తాము చేసిన తప్పులను ఒప్పుకున్నారని, అక్రమాలు జరిగాయని వారే అంగీకరించారని అన్నారు. అందుకే దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సీబీఐ ఎంక్వయిరీని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 
 
అసెంబ్లీకి హాజరుకాని వైఎస్‌ జగన్, వారానికో అంశంపై మీడియాకు వివరిస్తానని తెలిపారు. అందులో భాగంగా ఈవారం డీఎస్సీ, ఏపీపీఎస్సీపై మాట్లాడతాననిపేర్కొన్నారు. " DSC, APPSC అంశాలపై ఇవాళ మాట్లాడతాను. వీటికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు మీద్వారా ప్రజలముందు ఉంచుతాను. డీస్సీ విషయంలో లీకేజీ, అక్రమాలపై మేం ఇప్పటివరకూ ఏ అంశాలను అయితే ప్రజలముందు ఉంచామో, అవన్నీ వాస్తవేమని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితిలోకి వచ్చింది. తప్పు చేశారు కాబట్టి, గింజుకుంటారే తప్ప, సీబీఐ విచారణకు మాత్రం ముందుకు రావడంలేదు." అని అన్నారు. 

అలాంటివి సభలో ప్రశ్నిస్తామని గ్రహించే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అన్నారు జగన్. "ఇవన్నీ గట్టిగా లేవనెత్తుతామనే మాకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడంలేదు. చివరకు ప్రతిపక్షం లేకుండానే సభను  నడుపుతున్నారు. ప్రత్యర్థి జట్టు లేనిచోట, బౌలింగ్‌, పీల్డింగ్‌ లేకుండా, తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్‌ చేస్తున్నారు. తాము అద్భుతంగా చేశామని చెప్తున్నారు. DSC లీకేజీ, అక్రమాలపై చర్చకావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిని మా MLCలు స్తంభింపచేశారు. కాని, అక్కడ డిస్కషన్‌ చేయడానికి ముందుకు రావడంలేదు. ఎందుకు councilలో చర్చకు ఒప్పుకోలేదంటే, కారణం డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి, జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామాచేసి తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి." అని అన్నారు.  
 
డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ–పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్‌ స్వయంగా అంగీకరించారని జగన్ వీడియో ప్లే చేసి చూపించారు. తాము ప్రశ్నించిన కీలక అంశాల్లో ఇది కూడా ఒకటని గుర్తు చేశారు. తాము లేవనెత్తిన అంశాన్ని అంగీకరించడమే కాకుండా, తప్పేముంది అని దబాయించారని మండిపడ్డారు. "డీఎస్సీ పరీక్షలకు అవసరమైన ప్రశ్నల తయారీ అనేది SCERT డైరెక్టర్‌ బాధ్యత, డీఎస్సీ పరీక్షను నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌ది. ఈ రెండూ, ఒకే వ్యక్తికి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచారు. స్కాం ఇక్కడ నుంచే మొదలుపెట్టార్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశ్నలు తయారుచేసే వ్యవస్థకు, పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్‌ బ్యాలెనెస్‌ ఎందుకు తొలగించారో దర్యాప్తు జరగాలి, అంతేకాదు, ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలాలి? అందుకే సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తున్నాం." అని అన్నారు. 

డీఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని జగన్ ప్రశ్నించారు. ఆయనికి ఉద్యోగం ఇవ్వకుండా, ఆయన లాగిన్ ఐడీని ఎందుకు బ్లాక్ చేశారని నిలదీశారు. అంతేకాకుండా ఆ వ్యక్తి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌కు రాలేదని బుకాయిస్తున్నారని అన్నారు. లీకేజీ ఆయనతోనే ఆగిపోయిందా ఆయన ద్వారా ఇంకా ఎవరికైనా చేరిందా అనేది తేలాలని డిమాండ్ చేశారు. అందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

" ఫస్ట్‌ ర్యాంకు వచ్చిన నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్‌ మెరిట్‌ లిస్టులో నవీన్‌ పేరు ఉంది, ఆ తర్వాత మళ్లీ దీన్ని మార్చి, నవీన్‌ పేరు తీసేసి, రెండో మెరిట్‌లిస్ట్‌ ఎందుకు తెచ్చారు?మరి నవీన్‌కు ఎందుకు  ఉద్యోగం ఇవ్వలేదంటే, తండ్రీ కొడుకులిద్దరూ ఒకే విషయాన్ని చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు క్యాండిడేట్‌ రాలేదు కాబట్టి, పోస్టు ఇవ్వలేదని చెప్పారు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా ఫైల్‌ చేశారు. గతంలో అధికారులచేత ఇదే చెప్పించారు. మరి నేను వారిద్దరినీ అడుగుతున్నా, ఐడీని బ్లాక్‌చేసి, కాల్‌లెటర్‌ పంపనప్పుడు, ఆ నవీన్‌ సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాన్ని ఆధారాలతో అతను హైకోర్టులో అఫిడవిట్‌ వేశాడు కదా? వీటికి అసెంబ్లీలో అబ్బా, కొడుకులిద్దరూ ఎందుకు సమాధానం చెప్పలేదు. మరి నవీన్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి అని, ఆయకు క్వశ్చన్‌ బ్యాంకు యాక్సెస్‌ ఉందని, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకు వచ్చిందని, తేటతెల్లంగా కనిపిస్తా  ఉన్నప్పుడు, లీకేజీ జరిగింది కాబట్టి, దాన్ని దాచిపెట్టాలి కాబట్టి, అతనికి ఉద్యోగం ఇస్తే గోల అవుతుంది కాబట్టి, ముందస్తుగానే తెలివిగా మెరిట్‌ లిస్ట్‌ మార్చి, పక్కనపెట్టేశారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సీబీఐ దర్యాప్తు జరగాలా? వద్దా?" అని నిలదీశారు. 

Frequently Asked Questions

మెగా డీఎస్సీ 2025లో జగన్ ప్రధాన ఆరోపణలు ఏమిటి?

గత ఏడాది జరిగిన మెగా డీఎస్సీ 2025లో అనేక అక్రమాలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరపాలని జగన్ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ అక్రమాలపై జగన్ సీబీఐ విచారణ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

ప్రభుత్వం చేసిన తప్పులను అంగీకరించింది, కానీ సీబీఐ విచారణకు ముందుకు రావడం లేదు. ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ ఒకే అధికారికి అప్పగించడం అక్రమాలకు దారితీసిందని ఆయన వాదన.

డీఎస్సీ పరీక్షల ప్రక్రియలో జగన్ గుర్తించిన ప్రధాన అక్రమం ఏమిటి?

పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు రెండూ ఒకే అధికారికి అప్పగించడం పారదర్శకతను దెబ్బతీసిందని జగన్ ఆరోపించారు. లీకేజీలకు ఇది మార్గం సుగమం చేసిందని ఆయన అన్నారు.

శాసనమండలిలో డీఎస్సీ అంశంపై చర్చకు ప్రభుత్వం నిరాకరించడంపై జగన్ అభిప్రాయం ఏమిటి?

డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టే, సీబీఐ విచారణ అవసరం ఉందని గ్రహించే మండలిలో చర్చకు ఒప్పుకోలేదని జగన్ అన్నారు. బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget