అన్వేషించండి

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!

రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై పీసీసీ మంత్రికి నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆమె వివరణ ఇచ్చుకున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మంత్రి కొండా సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
  • ఆ వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు ఇచ్చింది.
  • సురేఖ కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమని, నోటీసు ఉపసంహరించాలని కోరారు.
  • కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది.

Konda Surekha: తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్‌ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు రేగాయి. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆరోపణలు పార్టీ వర్గాల్లో దుమారం రేపాయి. వరంగల్‌ జిల్లా వేదికగా జరిగిన ఈ రాజకీయ రచ్చ చివరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరి, మంత్రి కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోాజ్ నోటీసులు జారీ చేసే స్థాయికి చేరింది. దీనిపై ఆగస్టు 20న మంత్రి కొండా సురేఖ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లెటర్ రాశారు. 

వరంగల్‌ వేదికగా కొండా సుస్మితా పటేల్ సంచలనాత్మక వ్యాఖ్యలు 

మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. 

సుస్మితా పటేల్‌ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదని విమర్శించారు. టీడీపీ నుంచి వలస వచ్చిన వారిపైనే సీఎం ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నారని, రాష్ట్రంలో కేవలం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోందని, అసలైన అచ్చ కాంగ్రెస్‌ శ్రేణులకు స్థానం లేకుండా చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ఎవరూ సంతోషంగా లేరని ఆమె కామెంట్ చేశారు. 

పీసీసీ సీరియస్- మంత్రి కొండా సురేఖకు నోటీసు

మంత్రి కుమార్తె నేరుగా ముఖ్యమంత్రి, ఆయన తమ్ముడిపై వందల కోట్ల ఆరోపణలు చేయడం, పార్టీ నిర్ణయాలను తప్పుపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పీసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా పీసీసీని ఆదేశించారు. 

దీంతో రంగంలోకి దిగిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి స్పందించారు. సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కుమార్తె చేసిన విమర్శలకు తల్లిగా మంత్రిగా కొండ సురేఖే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిటీ భావించింది. 

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ కూడా ఈ పరిణామాలై స్పందిస్తూ పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడినా తీవ్ర క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చించారు. కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ కూడా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వల్ల  మంత్రి కొండా సురేఖ పార్టీ ముందు తలదించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. 

నోటీసులు ఉపసంహరించుకోవాలని కొండా సురేఖ రిక్వస్ట్‌

పీసీసీ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులపై స్పందిస్తూ, ఆగస్టు  20, గురువారం నాడు మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. ఆ లేఖలో కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించకుండానే ఆ వ్యాఖ్యల బాధ్యతను తనపై వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. " సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఒక స్వతంత్ర వ్యక్తిగా తన అభిప్రాయాలను మీడియా ముందు పంచుకున్నారు. ఆ వ్యాఖ్యల వ్యవహారంలో నా ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలను ప్రాతిపదిక పార్టీ ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు" అని సురేఖ లేఖలో స్పష్టం చేశారు. 

తనకు నోటీసులు ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని, కానీ తనకు సంబంధం లేని ఈ అంశంలో వివరణ కోరడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును వెంటనే ఉపసంహించుకోవాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. 

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కేసు 

ఈ పొలిటికల్ హైడ్రామా నడుస్తుండగానే, మంత్రి కొండా సురేఖ కుటుంబానికి అనుబంధంగా ఉన్న మరో తీవ్రమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. 

Image

బాధితుడు గొంగడి హరికృష్ణ ఇచ్చిన రాత పూర్వక ఫిర్యాదు మేరకు... సుమంత‌ అన అనుచరులతో కలిసి ఇనుప రాడ్లతో తనపై దాడికి పాల్పడ్డాడని, తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109 కింద సుమంత్, అతనితోపాటు ఉన్న మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 

మేడిపల్లి పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి ముందుగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. అయితే ఘటనా స్థలం జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో కేసు రికార్డులను, డాక్యుమెంట్స్‌ు తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. 

సుమంత్ గతంలో మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పని చేశారు. అయితే అతనిపై అంతకుముందే పలు అవినీతి, బలవంతపు వసూళ్ల ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అతనిని ఓఎస్డీ బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు నేరుగా హత్యాయత్నం కేసు నమోదు కావడం కొండా సురేఖ కుటుంబానికి రాజీయగా మరింత ఇబ్బందికరంగా మారింది. 

Frequently Asked Questions

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు ఎందుకు రేగాయి?

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణల కారణంగా కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగాయి.

సుస్మితా పటేల్ వ్యాఖ్యలపై పీసీసీ ఎలాంటి చర్య తీసుకుంది?

సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

షోకాజ్ నోటీసుపై మంత్రి కొండా సురేఖ ఎలా స్పందించారు?

తన కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటితో తనకు సంబంధం లేదని కొండా సురేఖ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు.

సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ వలసదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
Embed widget