వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలడానికి కారణాలు, నివారణకు చిట్కాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

తలపై తేమ పెరగడం

వర్షాకాలంలో గాలిలో తేమ శాతం పెరగడం వల్ల స్కాల్ప్ జిడ్డుగా మారి జుట్టు బలహీనపడే అవకాశం ఉంటుంది.

వర్షపు నీటి ప్రభావం

వర్షపు నీటిలో ఉండే కాలుష్య కారకాలు జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యాన్ని దెబ్బతీసి హెయిర్ ఫాల్‌కు కారణమవుతాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు

తల ఎప్పుడూ తడిగా ఉండటం వల్ల ఫంగస్ పెరిగి దురద, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు రావచ్చు.

స్కాల్ప్‌లో అధిక ఆయిల్

వర్షాకాలంలో చెమట, జిడ్డు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలహీనపడతాయి.

పోషకాల లోపం

సరైన ఆహారం తీసుకోకపోతే జుట్టుకు అవసరమైన ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు అందక జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.

స్కాల్ప్ శుభ్రత

వారానికి 2–3 సార్లు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్‌పై పేరుకుపోయిన దుమ్ము, జిడ్డు తొలగిపోతాయి.

జుట్టును ఆరబెట్టండి

తడి జుట్టును కట్టుకోవడం లేదా అలాగే వదిలేయడం వల్ల జుట్టు బలహీనమవుతుంది. కాబట్టి పూర్తిగా ఆరిన తర్వాతే కట్టుకోవాలి.

పోషకాహారం తీసుకోండి

గుడ్లు, ఆకుకూరలు, నట్స్, పండ్లు, చేపలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చాలి.

హెయిర్ స్టైలింగ్ వద్దు

వర్షాకాలంలో ఎక్కువగా హెయిర్ స్ప్రేలు, హీట్ స్టైలింగ్ టూల్స్ వాడటం జుట్టును మరింత దెబ్బతీయవచ్చు.

మసాజ్ చేయండి

కొబ్బరి నూనె లేదా ఇతర నూనెలతో వారానికి ఒకటి లేదా రెండు సార్లు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగై జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే నిపుణుల సలహాలు కచ్చితంగా తీసుకోండి.