చాలా మంది పిల్లలు ఆలస్యంగా లేవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ తినేందుకు సమయం దొరకదు. దీంతో ఖాళీ కడుపుతోనే స్కూల్‌కు వెళ్తారు.
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం లేదా ఎక్కువగా స్నాక్స్ తినడం వల్ల ఉదయం ఆకలి అనిపించకపోవచ్చు.
పోషకాహారం కంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్వీట్స్ ఎక్కువగా తినే పిల్లలు బ్రేక్‌ఫాస్ట్‌పై ఆసక్తి చూపకపోవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే శరీరానికి అవసరమైన గ్లూకోజ్ అందకపోవడంతో పిల్లలు అలసటగా ఫీలవుతారు.
ఉదయపు ఆహారం లేకపోతే క్లాస్‌రూమ్‌లో పాఠాలపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. దీంతో ఏకాగ్రత తగ్గుతుంది.
పోషకాహారం లోపించడం వల్ల నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. జ్ఞాపకశక్తిపై ఎఫెక్ట్ పడొచ్చు.
బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే పిల్లలతో పోలిస్తే స్కిప్ చేసే పిల్లల్లో విద్యా పనితీరు తగ్గే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఖాళీ కడుపుతో ఉండటం వల్ల చిరాకు, అసహనం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కనిపించవచ్చు.
బ్రేక్‌ఫాస్ట్ మానేసిన పిల్లలు తర్వాత ఎక్కువ ఆకలితో చిప్స్, చాక్లెట్లు వంటి అనారోగ్యకరమైన ఆహారాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
పాలు, గుడ్లు, పండ్లు, ఓట్స్, ఇడ్లీ, ఉప్మా వంటి పోషకాహారం ఉదయం తీసుకోవడం వల్ల పిల్లలకు శక్తి, ఏకాగ్రత, మెరుగైన అభ్యాస సామర్థ్యం లభిస్తుంది.