అన్వేషించండి

Leg Tingling : కాళ్లలో తిమ్మిర్లు తరచూ వస్తున్నాయా? డయాబెటిస్, విటమిన్ B12 లోపం సహా ఈ సమస్యలకు సంకేతం కావచ్చు

Leg Tingling and Numbness : కాళ్లల్లో తిమ్మిర్లు రావడం కామన్ అయినా.. తరచూ రావడం మాత్రం ఆరోగ్య సమస్యలకు ప్రధాన హెచ్చరిక అని.. దానిని లైట్ తీసుకోవద్దంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాళ్ల తిమ్మిర్లు విటమిన్ B12 లోపం, మధుమేహానికి సూచన.
  • నరాలపై ఒత్తిడి, రక్త ప్రసరణ లోపం, థైరాయిడ్ కారణాలు.
  • సరైన జీవనశైలి, ఆహారం, వ్యాయామం తిమ్మిర్లను తగ్గిస్తుంది.
  • తీవ్ర బలహీనత, నొప్పితో వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Leg Tingling Causes, Warning Signs : రోజంతా కూర్చొని పనిచేయడం లేదా ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉన్నప్పుడు కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. అయితే ఎలాంటి కారణం లేకుండా తరచూ కాళ్లలో తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇవి నరాల సమస్యలు, విటమిన్ లోపాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు. మరి కాళ్లలో తిమ్మిర్లు రావడానికి కారణాలు ఏంటో చూసేద్దాం.

విటమిన్ B12 లోపం

విటమిన్ B12 నరాల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పోషకం. దీని లోపం వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, బలహీనత వంటి సమస్యలు రావచ్చు. శాకాహారులు, వృద్ధుల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.

మధుమేహం

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీనిని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ప్రారంభ లక్షణాల్లో కాళ్లలో తిమ్మిర్లు, మంట, నొప్పి ఉంటాయి.

నరాలపై ఒత్తిడి

వెన్నెముకలో డిస్క్ సమస్యలు, సయాటికా (Sciatica) వంటి పరిస్థితుల్లో నరాలపై ఒత్తిడి పెరిగి కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి రావచ్చు.

రక్త ప్రసరణ సరిగా లేకపోవడం

శరీరంలోని కొన్ని భాగాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోతే తిమ్మిర్లు, చల్లదనం లేదా మొద్దుబారిన భావన కలగవచ్చు.

ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం

గంటల తరబడి కూర్చోవడం లేదా కాళ్లు మడిచి కూర్చోవడం వల్ల నరాలపై తాత్కాలికంగా ఒత్తిడి ఏర్పడి తిమ్మిర్లు రావచ్చు.

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత

శరీరంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల లోపం ఉంటే.. నరాలు, కండరాల పనితీరును ప్రభావితం చేసి తిమ్మిర్లకు కారణమవుతుంది.

థైరాయిడ్ సమస్యలు

హైపోథైరాయిడిజం ఉన్నవారిలో నరాల పనితీరు మందగించి చేతులు, కాళ్లలో తిమ్మిర్లు కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

పరిశోధనలు ఏమంటున్నాయంటే..

వైద్య పరిశోధనల ప్రకారం.. కాళ్లలో తరచూ తిమ్మిర్లు రావడం అనేది ఎక్కువగా నరాల సంబంధిత సమస్యలకు సంకేతంగా చెప్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, విటమిన్ B12 లోపం, నరాల దెబ్బతినడం వంటి పరిస్థితులు ఉన్నవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే ఎక్కువసేపు కూర్చునే జీవనశైలి కూడా ఈ సమస్యను పెంచుతుందని చెప్తున్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు ఈ లక్షణాలు గుర్తిస్తే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే వైద్యుల సూచనలతో విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్స్, సప్లిమెంట్స్ డైట్లో చేర్చుకోవాలి. డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రోజూ కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయాలని.. తగినంత నీరు తాగాలని చెప్తున్నారు. మద్యం, ధూమపానం మానేయాలని అంటున్నారు.

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలి?

కాళ్లలో తిమ్మిర్లతో పాటు బలహీనత, నడవడంలో ఇబ్బంది, తీవ్రమైన నొప్పి, మూత్రం లేదా మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఇవి తీవ్రమైన నరాల లేదా వెన్నెముక సమస్యలకు సంకేతం కావచ్చు.

అప్పుడప్పుడు వచ్చే కాళ్ల తిమ్మిర్లు సాధారణమే అయినప్పటికీ.. తరచూ వస్తుంటే వాటిని చిన్న సమస్యగా తీసుకోకూడదు. అది శరీరం పంపే హెచ్చరిక సంకేతంగా భావించి కారణాన్ని గుర్తించడం, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. సరైన జీవనశైలి, పోషకాహారం, వ్యాయామంతో చాలా సందర్భాల్లో ఈ సమస్యను నియంత్రించవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget