అన్వేషించండి

Vitamin B12 Deficiency : భారతదేశంలో పెరుగుతున్న విటమిన్ B12 లోపం.. అలసట, మర్చిపోవడానికి ఇదే కారణమా?

Vitamin B12 : భారతదేశంలో విటమిన్ B12 లోపం పెరుగుతోంది. నిపుణులు లక్షణాలు, ప్రమాదాలు గురించి వివరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..

Vitamin B12 Deficiency Is Rising in India : భారతదేశంలో చాలామందిలో విటమిన్ B12 లోపం పెరుగుతుంది. శరీరానికి ఈ విటమిన్ చాలా తక్కువ మొత్తంలో అవసరమైనప్పటికీ.. ఇది చాలా అవసరం. విటమిన్ B12 రక్తం, మెదడు, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల అలసట, బలహీనత, చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు రావడం, మానసిక స్థితిసలో మార్పులు లేదా జ్ఞాపకశక్తి సమస్యలకు కారణం కావచ్చు. దీంతో ప్రాబ్లం ఏంటంటే.. నష్టం జరిగే వరకు గుర్తించలేము. 

B12 లోపం ఎందుకు పెరుగుతోంది?

విటమిన్ B12 లోపం అన్ని వయసుల వారిని, లింగబేధం లేకుండా ప్రభావితం చేస్తుంది. డాక్టర్ నఖ్రా ప్రకారం ఈ లోపం కేవలం శాఖాహారులను మాత్రమే కాకుండా అందరిని ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. అధ్యయనాల ప్రకారం.. మాంసాహారులు కూడా B12 లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఎందుకంటే మీట్ ఎక్కువసేపు వేయించడం, వేడి చేయడం వల్ల ఆహారంలో విటమిన్ శాతం తగ్గుతుందట. దీనివల్ల B12 లోపం ఏర్పడుతుందని చెప్తున్నారు. 

విటమిన్ B12 ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైనది. కనుక దాని లోపం మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ లోపం హోమోసిస్టీన్ స్థాయిలను పెంచి.. గుండె, నాడీ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

విటమిన్ B12 లోపం లక్షణాలు

విటమిన్ B12 లోపం సంకేతాలు నెమ్మదిగా కనిపిస్తాయి. అందుకే చాలా మంది వాటిని సాధారణ అలసట లేదా ఒత్తిడిగా భావిస్తారు. ఈ కింది లక్షణాలు విటమిన్ B12 లోపాన్ని సూచిస్తాయి.

  • ఎల్లప్పుడూ అలసట లేదా బలహీనత
  • రంగు వెలిసిన చర్మం
  • మర్చిపోవడం
  • చురుకుగా లేకపోవడం
  • చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు
  • సరిగ్గా నడవ లేకపోవడం
  • కారణం లేకుండా అకస్మాత్తుగా కోపం లేదా బాధ
  • గర్భధారణ సమయంలో సమస్యలు
  • పిల్లలలో తక్కువ ఎదుగుదల లేదా ఏకాగ్రత సమస్యలు

ఈ సంకేతాలు ఏవైనా కనిపిస్తే విటమిన్ B12 పరీక్ష చేయించుకోండి. 

చికిత్స సులభమే

ప్రాథమిక రక్త పరీక్ష విటమిన్ B12 స్థాయిలను గుర్తించగలదు. లోపం ఉన్నట్లు గుర్తిస్తే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. స్ప్రేలు లేదా ఇంజెక్షన్ల రూపంలో సప్లిమెంట్లను ఇవ్వవచ్చు. ఈ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత.. వాటిని నిర్వహించడానికి రోజువారీ మోతాదులు మాత్రమే అవసరం. ఇది ప్రక్రియను సులభతరం చేస్తుంది. సురక్షితంగా తక్కువ ఖర్చుతో బయటపడొచ్చు.

విటమిన్ బి12 కోసం తీసుకోవాల్సిన ఆహారం

భారతదేశంలో అయోడిన్ లోపాన్ని తగ్గించడానికి ఉప్పుకు అయోడిన్ కలిపినట్లుగానే.. విటమిన్ B12తో నిండిన ఆహారాన్ని తీసుకుంటే B12 లోపం దూరం చేసుకోవచ్చు.

  • గోధుమ పిండి (అట్టా)లో తరచుగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది.
  • అల్పాహార ధాన్యాలు, ఓట్స్ మంచి ఎంపిక.
  • సోయా, బాదం, ఓట్ మిల్క్ వంటి మొక్కల ఆధారిత పాలు మంచివి. 
  • 1–2 టీస్పూన్లు పూర్తి ఈస్ట్ రోజువారీ B12 అవసరాన్ని తీరుస్తుంది.

వంట, జీర్ణక్రియ కొన్ని B12 ను నాశనం చేస్తాయి కాబట్టి.. మంచి పద్ధతిలో ఫుడ్ తీసుకోవడం లేదా 250–500 mcg సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Darker Mehndi Colour : మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
మెహందీ డిజైన్స్ ఎర్రగా పండాలా? అయితే ఫాలో అవ్వాల్సిన సింపుల్ చిట్కాలు, చేయకూడని తప్పులు ఇవే
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
Besan Ladoo : దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
దీపావళి స్పెషల్ బేసిన్ లడ్డూలు.. మార్కెట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా, రెసిపీ ఇదే
Hair Growth Foods : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే ఇవి తినండి.. కుదుళ్ల నుంచి పోషణ అందుతోందంటోన్న పరిశోధనలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
KTR Help: మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
మాట నిలబెట్టుకున్న కేటీఆర్. మస్కట్‌లో చిక్కుకున్న కొడంగల్ మహిళకు సాయం
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
Best Mileage Diesel Cars: మీ డబ్బు ఆదా చేస్తూ ఎక్కువ మైలేజీ ఇచ్చే డీజిల్ SUVలు.. 16.5 నుంచి 24.08kpl వరకు!
బెస్ట్‌ మైలేజీ ఇచ్చే 7 డీజిల్ కాంపాక్ట్ SUVలు ఇవే.. టాప్ ప్లేస్‌లో టాటా నెక్సాన్
Embed widget