అన్వేషించండి

SIM Card Gold: ఫోన్‌లో బంగారం ఉంటుంది తెలుసా? ఎందుకు వాడతారు? దాని విలువ ఎంత?

SIM Card Gold: సిమ్ కార్డు లేదా చిప్‌లో బంగారం దాచిపెట్టారనేది నిజమే, కానీ దాంతో మీరు కోటీశ్వరులు కాలేదు. ఇంతకీ ఫోన్‌లో ఎంత బంగారం ఉపయోగిస్తారో చూద్దాం

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చైనా వ్యక్తి సిమ్ కార్డులు, ఈ-వ్యర్థాల నుండి బంగారం తీసిన వార్త వైరల్.
  • సిమ్ కార్డులు, చిప్‌లపై తుప్పు నివారణకు బంగారు పూత ఉంటుంది.
  • సిమ్‌లలో బంగారం చాలా తక్కువ, సాధారణ వ్యక్తికి తీయడం అసాధ్యం.
  • అధిక మొత్తంలో ఈ-వ్యర్థాల నుంచి ప్రత్యేక ప్రక్రియతో బంగారం తీయవచ్చు.

SIM Card Gold: మీ ఫోన్‌లోని చిన్న సిమ్ కార్డ్ నిజంగా ఒక నిధినా? గతంలో ఒక వార్త వైరల్ అయ్యింది. చైనాకు చెందిన వ్యక్తి సిమ్ కార్డులు మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి లక్షలాది రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాడని దాని సారాంశం. దీంతో మన రోజువారీ సిమ్ కార్డులు, చిప్‌లు నిజంగా అంత విలువైనవా, లేదా ఇది కేవలం అపోహనా? అనే అనుమానం చాలా మంది ఉంది. 

ఒక చైనా వ్యక్తి పాత సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్ విడిభాగాలు మరియు ఈ-వ్యర్థాలను సేకరించి దాదాపు 191 గ్రాముల బంగారాన్ని వెలికితీసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్త ఒక చైనీస్ మీడియా పోర్టల్‌లో కనిపించింది. దీని తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ చిప్‌లలో అంత బంగారం ఎలా ఎక్కడి నుంచి వస్తుంది? దానిని ఎందుకు ఉపయోగిస్తారని ప్రజలు ఆశ్చర్యపోవడం ప్రారంభించారు.

టెక్నికల్‌గా చూస్తే  సిమ్ కార్డులు, ఇతర ఎలక్ట్రానిక్ చిప్‌ల కొన్ని భాగాలపై తరచుగా బంగారు పూతకు సంబంధించిన పలుచని పొర ఉంటుంది. బంగారం తుప్పును నిరోధించడం, విద్యుత్తును సమర్థవంతంగా నిర్వహించడం వంటి పనులకు ఉపయోగిస్తారు. చిప్ కనెక్టివిటీ బలంగా ఉండేలా, పరికరం చాలా కాలం పాటు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, సిమ్ కార్డ్‌లో బంగారం మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా మైక్రోగ్రామ్ స్థాయిలో లేదా గ్రాములో వెయ్యి వంతు లేదా అంతకంటే తక్కువ ఉంటుంది.

ఇంత తక్కువ పరిమాణంలో బంగారం కనిపించదు లేదా సగటు వ్యక్తి దాన్ని తీయడం కూడా సాధ్యం కాదు. అందుకే ఒకటి లేదా రెండు లేదా డజన్ల కొద్దీ సిమ్ కార్డుల నుంచి బంగారం తీయడం ద్వారా ధనవంతులు కావాలనే ఆలోచన ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. ఒకే సిమ్ కార్డు నుంచి బంగారాన్ని తీయడం సాధ్యం కాదు. బదులుగా చాలా కాలం పాటు పాత మొబైల్ భాగాలు, సర్క్యూట్ బోర్డులు, ఇతర చిప్‌లతో సహా పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరిస్తే కాస్త బంగారం సేకరించవచ్చు.  

ఒక ప్రత్యేక రసాయన ప్రక్రియ సహాయంతో లోహాలను వేరు చేయాలి. ఈ మొత్తం ప్రక్రియలో పెద్ద మొత్తంలో వ్యర్థాలు , అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి. ఇంతలా శ్రమిస్తే తప్ప  బంగారాన్ని వెలికి తీయలేం. అయితే, ఒక సాధారణ వ్యక్తి సిమ్ కార్డ్ లేదా చిప్ నుంచి బంగారాన్ని తీయలేడు. వాటిలో బంగారం మొత్తం చాలా తక్కువగా ఉంటుంది, దానిని తీయడానికి భారీగా ఖర్చు పెట్టాలి. రాత్రి పగలు శ్రమించాలి. అందులో ప్రమాదం కూడా ఉంటుంది.  

 

Frequently Asked Questions

సిమ్ కార్డులలో బంగారం ఎందుకు ఉపయోగిస్తారు?

సిమ్ కార్డులు మరియు ఎలక్ట్రానిక్ చిప్‌ల కొన్ని భాగాలపై తుప్పును నిరోధించడానికి మరియు విద్యుత్తును సమర్థవంతంగా నిర్వహించడానికి బంగారు పూత ఉంటుంది. ఇది చిప్ కనెక్టివిటీని బలంగా ఉంచుతుంది.

ఒక సిమ్ కార్డు నుండి బంగారం తీయడం సాధ్యమేనా?

ఒక సిమ్ కార్డులో ఉండే బంగారం మొత్తం చాలా తక్కువగా ఉంటుంది (మైక్రోగ్రామ్ స్థాయిలో). కాబట్టి, ఒకటి లేదా కొన్ని సిమ్ కార్డుల నుండి బంగారం తీయడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదు.

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి బంగారం ఎలా తీస్తారు?

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి బంగారం తీయడానికి ప్రత్యేక రసాయన ప్రక్రియలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరియు పెద్ద మొత్తంలో వ్యర్థాలు అవసరం. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ.

సిమ్ కార్డుల నుండి బంగారం తీయడం ప్రమాదకరమా?

అవును, సిమ్ కార్డులు మరియు ఎలక్ట్రానిక్ భాగాల నుండి బంగారాన్ని తీయడానికి ప్రయత్నించడం ప్రమాదకరం. దీనికి ప్రత్యేక పరికరాలు మరియు శిక్షణ అవసరం.

టాప్ హెడ్ లైన్స్

TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ! పార్టీ రద్దు అవుతుందా?
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ! పార్టీ రద్దు అవుతుందా?
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ! పార్టీ రద్దు అవుతుందా?
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ! పార్టీ రద్దు అవుతుందా?
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Rao Bahadur Collections Day 1: ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఓవర్సీస్‌లో దుమ్ము రేపిన సత్యదేవ్... 'రావు బహదూర్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
How Car Airbags Work: ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
ఎయిర్‌బ్యాగ్ లోపల సరిగ్గా ఏం జరుగుతుంది? అది ప్రాణాలను ఎలా కాపాడుతుంది? 
Chiluka Gorinka: చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
చిలుక గోరింకకు సంబంధం లేదు..మరెందుకు అలా దీవిస్తారు?
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Embed widget