అన్వేషించండి

Watermelon Buying Tips : పుచ్చకాయ కొనేప్పుడు ఇలా చూసి ఎంచుకోండి.. తియ్యగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Watermelon : సమ్మర్​లో పుచ్చకాయకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు అది చప్పగా, రంగుతో నిరాశపరుస్తుంది. మరి వాటిని కొనేప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పుచ్చకాయ కింది భాగంలో పసుపు మచ్చ ఉంటే పండినది.
  • తట్టినప్పుడు గట్టిగా, ఖాళీగా శబ్దం వస్తే రుచికరమైనది.
  • పరిమాణానికి తగిన బరువు, సమాన ఆకారం మంచి పుచ్చకాయ సూచిస్తాయి.
  • తొక్క మెరుపు లేకుండా, రంగు అంటుకోని వాటిని ఎంచుకోండి.

Simple Tips to Pick Sweet Watermelon : వేసవి కాలం వచ్చిందంటే చాలామంది ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది రుచిగా ఉండడమే కాకుండా.. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఆకలితో పాటు.. దాహాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎండవల్ల కలిగే డీహైడ్రేషన్ సమస్యను తగ్గించుకోవడం సులభం అవుతుంది. 

అయితే మార్కెట్‌లో పుచ్చకాయ కొనేప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది? తియ్యగా ఉంటుందా? లేదా? మంచిది ఎలా గుర్తించాలి? అని ఆలోచిస్తారు. అయితే దీనిగురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సరైన పుచ్చకాయ ఎంచుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు. తియ్యని, టేస్టీగా, ఆర్గానిక్​గా ఉండే పుచ్చకాయను ఇట్టే ఎంచుకోవచ్చు. అవేంటో చూసేద్దాం.

పుచ్చకాయపై పసుపు మచ్చ 

పుచ్చకాయను కొనేప్పుడు ముందుగా దాని కింద భాగాన్ని గమనించాలి. అక్కడ పసుపు లేదా క్రీమ్ కలర్ మచ్చ కనిపిస్తే అది పండిన పుచ్చకాయ అని అర్థం. ఇది నేలపై పడుకుని పండిందనడాన్ని సూచిస్తుంది. కాబట్టి అలాంటివి సాధారణంగా తియ్యగా ఉంటాయి.

పుచ్చకాయను తట్టండి..

పుచ్చకాయను చేతితో తట్టినప్పుడు లోపల నుంచి గట్టిగా, ఖాళీగా వినిపించే శబ్దం వస్తే అది పండిన పుచ్చకాయ. కానీ మందమైన శబ్దం వస్తే అది ఇంకా పూర్తిగా పండలేదని అర్థం. కాబట్టి ఇది అంత తియ్యగా ఉండకపోవచ్చు.

బరువుగా ఉన్న పుచ్చకాయ తీసుకోవచ్చా?

పుచ్చకాయను తడితే ఖాళీగా, పెద్ద శబ్ధం రావాలి కానీ.. దానిని చేతిలోకి తీసుకున్నప్పుడు దాని పరిమాణానికి తగినంత బరువుగా ఉండేది ఎంచుకోవాలి. ఇది లోపల ఉన్న నీటి శాతాన్ని సూచిస్తుంది.

ఆకారం సరిగ్గా ఉంటే మంచిదా?

పుచ్చకాయను ఎంచుకునేప్పుడు గుండ్రంగా లేదా సమాన ఆకారంలో ఉన్నదాన్ని తీసుకోవాలి. విచిత్రంగా వంగిన ఆకారం ఉన్న పుచ్చకాయలు సరైన విధంగా పెరగకపోవచ్చు. కాబట్టి ఓ వైపు రుచిగా.. మరోవైపు రుచి లేకుండా, తెల్లగా ఉంటాయి.

తొక్క మెరుపు లేకుంటే..

పుచ్చకాయ తొక్క కొంచెం మ్యాట్ ఫినిష్ లాగా ఉంటే అది పండినదని అర్థం. చాలా మెరుస్తూ ఉంటే అది ఇంకా పూర్తిగా పండకపోయి ఉండవచ్చు.

అలాగే పుచ్చకాయ ముక్కను కోసిన తర్వాత దాని రంగు చేతికి అంటుకున్నట్లు కనిపిస్తే దానికి రంగు ఇంజెక్ట్ చేశారని తెలుసుకోవాలి. కాబట్టి పుచ్చకాయ కొనేప్పుడు ఈ సింపుల్ టిప్స్ గుర్తుపెట్టుకుంటే.. తియ్యగా, రుచిగా ఉండే వాటిని సులభంగా ఎంచుకోగలుగుతారు. వేసవిలో శరీరానికి తగినంత నీరు అందించడానికి పుచ్చకాయను డైట్‌లో చేర్చుకోవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget