కుండ నీళ్లు? ఫ్రిజ్ వాటర్? వేసవిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

Published by: Geddam Vijaya Madhuri

సమ్మర్లో, వేడి వాతావరణంలో చల్లని నీరు తీసుకోవాలనిపిస్తుంది. ఆ సమయంలో ఫ్రిజ్ వాటర్ తాగాలా? లేక కుండ నీరు మంచిదా?

ఫ్రిజ్ లోని చల్లటి నీరు త్రాగటం వలన శరీర సహజ జీర్ణశక్తి తగ్గుతుంది. దీనివల్ల ఆహారం జీర్ణం అవ్వటం కష్టమవుతుంది.

అధిక చల్లటి నీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అసిడిటీ, గ్యాస్, వాంతులు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

గొంతులో వాపు, శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇది జలుబు, దగ్గుకు ప్రధాన కారణం అవుతుంది.

ఫ్రిజ్ నీరు తాగడం వల్ల త్వరగా దాహం తీరుతుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ నీరు అందుతుంది.

కుండలో నీరు సహజంగా చల్లబడుతుంది. ఇది శరీర అంతర్గత ఉష్ణోగ్రతతో సరిగ్గా సమతుల్యం చేస్తుంది.

మట్టి సహజ గుణాల వల్ల మట్టి కుండలో నీరు తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ముఖంపై సహజ మెరుపు వస్తుంది.

కుండ నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉండదు. ఇది జీర్ణవ్యవస్థను లోపలి నుంచి చల్లబరుస్తుంది.

సహజమైన చల్లదనం వల్ల మీరు తృప్తిగా తగినంత నీరు తాగుతారు. ఇది వేసవిలో జరిగే నిర్జలీకరణం, వేడి గాలుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

ఫ్రిజ్ నీరు తాగాలనిపిస్తే.. మట్టి పాత్ర లేదా సాధారణ నీటితో కలిపి తాగడం మంచిది.

ఇది కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుని ఎంచుకుంటే మంచిది.