అన్వేషించండి

Chia Seeds with Lemon : 30 రోజులు చియా సీడ్స్‌తో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుంది? లాభాలు, జాగ్రత్తలు ఇవే

Chia Seeds : చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచిది. ఉదయాన్నే వీటిని నిమ్మరసంతో తీసుకుంటే కలిగే లాభాలు ఏంటి? ఏ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిదంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చియా విత్తనాలు నిమ్మరసంతో 30 రోజులు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • బరువు నియంత్రణకు, శక్తి వృద్ధికి చియా విత్తనాలు సహాయపడతాయి.
  • విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • అతిగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

Chia Seeds with Lemon for 30 Days : ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది ఉదయాన్నే చియా సీడ్స్‌ను తమ డైట్లో తీసుకుంటున్నారు. పోషకాలు అధికంగా ఉండే ఈ చిన్న గింజలు శరీరానికి అనేక ప్రయోజనాలు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని నిమ్మరసంతో కలిపి 30 రోజులు తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? లాభాలు ఏంటి? నష్టాలు ఏంటి? తీసుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మెరుగైన జీర్ణక్రియ

చియా సీడ్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే నిమ్మరసంతో తీసుకుంటే కడుపు శుభ్రంగా ఉండటానికి సహాయపడుతుంది.

బరువు నియంత్రణకై..

చియా సీడ్స్ నీటిని ఎక్కువగా పీల్చుకుని జెల్‌లా మారతాయి. దీంతో ఎక్కువసేపు ఆకలి తగ్గుతుంది. అందువల్ల వెయిట్ లాస్ డైట్‌లో చాలా మంది వీటిని తీసుకుంటారు.

ఎనర్జీ కోసం

చియా సీడ్స్​లో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి.

చర్మ ఆరోగ్యానికై..

నిమ్మకాయలో విటమిన్ C ఉండటం వల్ల చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. చియా సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

చియా సీడ్స్ ఆరోగ్యానికి మంచివే అయినా.. ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు రావచ్చు. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అందుకే లిమిటెడ్​గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎలా తీసుకుంటే మంచిది..

చియా సీడ్స్ ఉదయాన్నే తీసుకోవాలనుకుంటే.. ఒక గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసి రాత్రి నానబెట్టుకోవాలి. తర్వాత అందులో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తాగవచ్చు. అవసరమైతే తేనె కూడా కలుపుకోవచ్చు. రోజుకు 1 లేదా 2 టీ స్పూన్లకు మించి తీసుకోకూడదు. కచ్చితంగా నీటిలో నానబెట్టి తీసుకోవాలి. జీర్ణ సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget