అన్వేషించండి

Sleep Issues : యువతలో నిద్ర సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?

Sleep Problems : ఇండియాలోని యువతలో నిద్ర సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యువతలో పెరుగుతున్న నిద్రలేమికి స్క్రీన్ టైమ్, ఒత్తిడి కారణాలు.
  • అసమతుల్య ఆహారం, వ్యాయామం లేకపోవడం సమస్యను పెంచుతున్నాయి.
  • ఏకాగ్రత లోపం, దీర్ఘకాలిక వ్యాధులు నిద్రలేమితో పెరుగుతాయి.
  • రెండు వారాల పైన నిద్ర సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

Sleeping Issues in Young People : ఇటీవలి కాలంలో యువతలో నిద్ర సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం, ఒత్తిడి, అసమతుల్యమైన జీవనశైలి కారణంగా చాలా మంది యువత సరిగ్గా నిద్ర పొవడం లేదని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో యుక్త వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని.. ఇది చాలా ప్రమాదమని పరిశోధకులు చెప్తున్నారు.

Indian Council of Medical Research నివేదికల ప్రకారం.. నగరాల్లో నివసించే యువతలో ఈ నిద్రలేమి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి చాలానే కారణాలు ఉన్నాయంటున్నారు. అలాగే ఈ సమస్యను చాలామంది విస్మరించి మరింత ప్రమాదకరంగా పరిస్థితిని మార్చుకుంటున్నారని చెప్తున్నారు. ఇంతకీ ఆ కారణాలు ఏంటో.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలో ఇప్పుడు చూసేద్దాం. 

యువతలో నిద్ర సమస్యలకు కారణాలు

  • స్క్రీన్ టైమ్

మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు వాడటం వల్ల రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొంటున్నారు. స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడుకు నిద్ర సంకేతాలను ఆలస్యం చేస్తుంది.

  • పని, ఒత్తిడి

కార్పొరేట్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, చదువు ఒత్తిడి వల్ల యువతలో మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇది నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది. దీంతో చాలామంది నిద్రకు దూరమవుతున్నారు.

  • భోజన సమయాలు

రాత్రిళ్లు ఆలస్యంగా తినడం.. మసాలా ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ కూడా నిద్రకు భంగం కలిగిస్తాయి.

  • ఫిజికల్ యాక్టివిటీ 

వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు స్క్రీన్స్ ముందు కూర్చోవడం, పడుకుని మొబైల్ స్క్రోల్ చేస్తూ శరీరానికి ఏ మాత్రం శ్రమని ఇవ్వకపోవడం వల్ల కూడా నిద్రను దూరం చేసుకుంటున్నారు.

  • సోషల్ మీడియా 

సోషల్ మీడియా స్క్రోలింగ్ వల్ల చాలా మంది రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీంతో స్లీప్ సైకిల్ మరింత డిస్టర్బ్ అవుతుంది. 

నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలు

నిద్ర సరిపోకపోతే శరీరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఏకాగ్రత తగ్గడం నుంచి మొదలుకొని.. మూడ్ స్వింగ్స్, అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో ఇది Insomnia వంటి సమస్యలకు దారితీయవచ్చు. మధుమేహం, బీపీ, గుండె సమస్య ప్రమాదం రెట్టింపు ఉంటుంది. 

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే..

నిపుణుల ప్రకారం.. రెండు వారాలకంటే ఎక్కువ కాలం నిద్ర పట్టకపోవడం, రాత్రుళ్లు మధ్యలో తరచూ మేల్కొనడం, ఉదయం లేవగానే అలసటగా ఉన్నప్పుడు, రోజువారీ పనులపై దాని ప్రభావం ఉందని అనిపించినప్పుడు వైద్య సహాయం తీసుకోవాలంటున్నారు. ఇది మేజర్ కాకముందే సెట్ చేసుకుంటే.. దీర్ఘకాలిక సమస్యల ప్రమాదం వీలైనంత దూరం చేసుకోవచ్చంటున్నారు. 

నిద్ర సమస్యలను దూరం చేసుకోవడానికై..

నిద్ర సమస్యను దూరం చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం చేయాలి. నిద్రకు ముందు ఫోన్ చూడకూడదు. కాఫీ, టీని రాత్రుళ్లు తీసుకోకూడదు. పగటి వేళ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలా మంచిది. రోజుకు కనీసం 7–9 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget