ఈ తప్పులు చేస్తే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి.. జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

మన దైనందిన జీవితంలో కొన్ని చెడు అలవాట్లు.. నెమ్మదిగా కిడ్నీలకు శాశ్వత నష్టం కలిగిస్తాయి.

తగినంత నీరు త్రాగకపోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. రాళ్ల ప్రమాదం పెరుగుతుంది.

అధిక ఉప్పు ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది మూత్రపిండాల నాళాలను దెబ్బతీస్తుంది.

డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి.

ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్ (UTI) వస్తుంది.

మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు తరచుగా సంభవిస్తే.. అవి నేరుగా మూత్రపిండాలకు చేరుకుంటాయి. తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి.

జంక్ ఫుడ్, తీపి పదార్ధాలు, అధికంగా ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం, ఊబకాయం వస్తాయి.

అధిక రక్త చక్కెర, ఊబకాయం దీర్ఘకాలంలో 'క్రోనిక్ కిడ్నీ డిసీజ్' (CKD)కి కారణమవుతాయి.

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగండి. ఏదైనా శారీరక సమస్యలుంటే నిపుణుల సలహా తీసుకోండి.