అన్వేషించండి

Dahi Vankaya Recipe : వంకాయ, పెరుగుతో టేస్టీ రెసిపీ.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే టేస్టీ, ఈజీ కూడా

Tasty Brinjal Recipe : టేస్టీగా, సింపుల్గా ఉండే వంకాయ రెసిపీని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే మీరు ఈ మోస్ట్ వైరల్ రెసిపీని కచ్చితంగా ట్రై చేయాల్సిందే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దహీ వంకాయ, పెరుగు, మసాలాలతో చేసిన వినూత్న వంటకం.
  • వంకాయ ముక్కలను పసుపు, కారం, ఉప్పుతో కలిపి వేయించాలి.
  • మసాలాలు కలిపిన చిక్కటి పెరుగును వేయించిన వంకాయలపై పోయాలి.
  • తాలింపుతో అలంకరించి, రోటీలు, అన్నంతో రుచి చూడవచ్చు.

Creamy Curd Brinjal Recipe : వంకాయను చాలామంది ఇష్టంగా తింటారు. చాలా రకాలుగా దాని రుచిని ఆస్వాదిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియోలో దహీ వంకాయ రెసిపీ బాగా వైరల్ అవుతుంది. రొటీన్ వంకాయ కూరలు తిని బోర్ కొట్టిన వారు.. కచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. పెరుగులో రుచి, క్రీమీ లుక్, మసాలాల సువాసన, బంగారు రంగులో వేయించిన వంకాయల కలయిక ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. చపాతీ, పుల్కా, జీరా రైస్ లేదా అన్నంతో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు

వంకాయల కోసం

వంకాయలు - 2 పెద్దవి (గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి)

పసుపు - అర టీస్పూన్

కారం - 1 టీస్పూన్

ఉప్పు - తగినంత

నూనె - 1 టేబుల్ స్పూన్ (వంకాయ ఫ్రై చేయడానికి)

పెరుగు మిశ్రమం కోసం

చిక్కటి పెరుగు - ఒకటిన్నర నుంచి 2 కప్పులు

ఉప్పు - తగినంత

జీలకర్ర పొడి - పావు టీస్పూన్

కారం - కొద్దిగా

గరం మసాలా - చిటికెడు

తాలింపు కోసం

నూనె - 1 టీస్పూన్

జీలకర్ర - అర టీస్పూన్

పచ్చిమిర్చి - 2 (చీల్చినవి)

కరివేపాకు - కొద్దిగా

కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో పసుపు, కారం, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి. తర్వాత వంకాయలను బాగా కడిగి.. పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. వంకాయలను గుండ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని వంకాయ ముక్కలకు రెండు వైపులా బాగా పట్టించి 10 నుంచి 15 నిమిషాలు అలా ఉంచండి. 

తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో వంకాయ ముక్కలను పేర్చి.. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు.. మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టాలి. ఇలా మొత్తం వంకాయ ముక్కలను ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో చిక్కటి పెరుగు తీసుకుని అందులో ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కారం, గరం మసాలా వేసి బాగా గిలక్కొట్టాలి. సర్వింగ్ ప్లేట్‌లో ముందుగా వేయించిన వంకాయ ముక్కలను అమర్చి.. వాటిపై పెరుగు మిశ్రమాన్ని సమంగా పోయాలి. 

చివరగా చిన్న పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు తయారు చేయాలి. ఈ వేడి తాలింపును పెరుగు వేసిన వంకాయలపై పోయాలి. చివరిగా కొత్తమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. క్రీమీగా, పుల్లటి రుచితో, మసాలాల సువాసనతో నోరూరించే దహీ వంకాయ రెడీ. వేడి వేడి రొట్టెలు, చపాతీలు లేదా అన్నంతో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది.

మరిన్ని టేస్టీ, హెల్తీ రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget