అన్వేషించండి

Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే

Myth of Seven Lookalikes : ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? దీని వెనుక ఉన్న నిజం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మానవ పోలికల 'ఏడుగురు నకిలీలు' నమ్మకానికి శాస్త్రీయ ఆధారం లేదు.
  • ఖచ్చితమైన ముఖ పోలికలు చాలా అరుదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
  • ఒకేలాంటి రూపం, కేశాలంకరణ అపరిచితులను పోలినట్లు చేయగలవు.
  • కొన్ని జన్యు నమూనలు అపరిచితులలో ఆశ్చర్యకరమైన పోలికలు సృష్టిస్తాయి.

Human Lookalikes Fact vs Myth : ప్రపంచంలోని ప్రతి మాదిరిగా ఏడుగురు(Seven Identical Lookalikes).. ఒకే పోలికలు కలిగినవారు ఉంటారని ఎన్నో దశాబ్దాలుగా నమ్ముతున్నారు. అందుకే మనిషిని పోలిన మనుషులు 7గురు ఉన్నారు అంటుంటారు. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని.. ఇది కేవలం జానపద కథల ఆధారంగా ఏర్పడిన ఒక కట్టుకథ అని అనేవాళ్లు కూడా ఉన్నారు. కానీ పరిశోధకుల ప్రకారం.. అపరిచితులు ఒకేలా కనిపించినప్పటికీ.. 100% ఒకేలాంటి ముఖం ఉండే అవకాశాలు చాలా తక్కువ అని అంటున్నారు. 

అడిలైడ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. అనేక కీలక ముఖ కొలతలను విశ్లేషించి.. ఇద్దరు అపరిచితులు అన్ని ముఖ లక్షణాలతో కచ్చితంగా కలవడం అనేది ట్రిలియన్‌లో ఒకటి అని కనుగొన్నారు. సుమారు 8 బిలియన్ల ప్రపంచ జనాభాతో.. అటువంటి ఖచ్చితమైన సరిపోలిక అసాధ్యంగా పరిగణిస్తున్నారు. 

లుక్స్ బట్టి డిసైడ్ చేస్తారా.. 

మనుషులు కచ్చితమైన కొలతల కంటే వారి మొత్తం రూపాన్ని బట్టి ముఖాలను గుర్తిస్తారు. ఒకేలాంటి హెయిర్ స్టైలింగ్, గడ్డం, మీసాలు, కంటి రంగు లేదా హావభావాలు, వారి ముఖ లక్షణాలలో గణనీయమైన తేడాలు ఉన్నప్పటికీ.. ఇద్దరు అపరిచితులను దాదాపు ఒకేలా కనిపించేలా చేయగలవని తెలిపారు. 

అపరిచితుల ముఖాలలో అద్భుతమైన పోలికలు ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలో తేలింది. ఈ వ్యక్తులను కొన్నిసార్లు కవల అపరిచితులు అని పిలుస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా తమలాగే కనిపించే వ్యక్తులను డాపెల్‌గ్యాంగర్ అని పిలుస్తారు. అయితే వారు కవలలు కాదు. కేవలం ముఖంలోని కొన్ని లక్షణాలు మాత్రమే పోలి ఉండవచ్చు.

డీఎన్ఏ ఒకటే అయినా రూపంలో తేడా?

ప్రతి మనిషి తమ DNAలో సుమారు 99.9 శాతం పంచుకున్నప్పటికీ.. ముఖ రూపం కేవలం ఒక చిన్న భాగం ద్వారానే నిర్ణయిస్తారు. ఎందుకంటే బిలియన్ల కొద్దీ ప్రజలు అనేక జన్యు లక్షణాలను పంచుకుంటారు. అందుకే ఎలాంటి జీవ సంబంధం లేకపోయినా కూడా అపరిచితుల ముఖాలు ఆశ్చర్యకరంగా ఒకేలా ఉంటారు. 

ఈ వ్యక్తులు ముఖ లక్షణాలను ప్రభావితం చేసే కొన్ని జన్యు నమూనాలను పంచుకోవచ్చు. అంతేకానీ ప్రతి ఒక్కరిలాంటి వారు ఏడుగురు ఉంటారనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒకేలా కనిపించే వ్యక్తుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరికీ ఏడుగురు డూప్స్ ఉంటారు అనే నమ్మకం మరింత బలపడింది. కానీ వైరల్ ఉదాహరణలు శాస్త్రీయ ఆధారాలు కావని చెప్తున్నారు పరిశోధకులు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget