అన్వేషించండి

Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?

Foods To Avoid During Monsoon : వర్షాకాలంలో కొన్ని ఆహారాలు తినకూడదని నిపుణులు చెప్తున్నారు. అలాగే కొన్ని ఫుడ్స్ తీసుకునేప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది, వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ.
  • సముద్రపు ఆహారం, ఆకుకూరలు, స్ట్రీట్ ఫుడ్ జాగ్రత్తగా తినాలి.
  • నిల్వ, డీప్ ఫ్రై, సలాడ్లు, కోసిన పండ్లు మానుకోండి.
  • తాజాగా ఉడికించిన, వేడి ఆహారం, మరిగించిన నీరు సురక్షితం.

Monsoon Diet Tips Foods To Avoid List : వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణంతో పాటు అనేక సీజనల్ వ్యాధులు కూడా వస్తాయి. ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మన జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహారాలను కచ్చితంగా పరిమితంగా తీసుకోవాలని లేదా పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలని చెప్తున్నారు. మరి తినకూడని ఆహారాలు ఏంటో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం. 

సముద్రపు ఆహారం(Sea Food)

వర్షాకాలంలో చేపలు, రొయ్యలు, పీతలు వంటి సముద్ర ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలంలో అనేక చేపల జాతులకు సంతానోత్పత్తి సమయం. దీంతో వాటి నాణ్యత మారే అవకాశం ఉంటుంది. అలాగే నిల్వ, రవాణా సమయంలో పరిశుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పూర్తిగా ఉడికించిన తాజా సముద్ర ఆహారాన్నే మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. పచ్చిగా లేదా సరిగా ఉడకని సీ ఫుడ్ తినకపోవడమే మంచిది.

Also Read : వేసవి నుంచి వర్షాకాలం మారే సమయంలో ఎక్కువగా వచ్చే సీజనల్ వ్యాధులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ఆకుకూరలు

పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే. అయినప్పటికీ వర్షాకాలంలో వాటిపై మట్టి, దుమ్ము, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని బాగా కడిగి, శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. బయట తయారుచేసిన ఆకుకూరల వంటకాల కంటే ఇంట్లో తయారు చేసుకోవడమే మంచిదని చెప్తున్నారు.

స్ట్రీట్ ఫుడ్

వర్షాకాలంలో రోడ్డు పక్కన అమ్మే ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. తేమ కారణంగా ఆహారం త్వరగా పాడవుతుంది. పరిశుభ్రత లేకపోతే కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read : వర్షాకాలంలో కామన్​గా వచ్చే వ్యాధులు ఏంటి? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

సలాడ్లు

సలాడ్లు పచ్చిగా తింటే.. కూరగాయలను పూర్తిగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా లేదా పరాన్నజీవులు శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. సలాడ్లు తినాలనుకుంటే బాగా కడిగి లేదా ఉడికించినవి మాత్రమే తీసుకోవాలి.

కట్ చేసి ఉంచిన పండ్లు

బయట అమ్మేవారు.. పండ్లను ముందుగానే కోసి ఉంచుతారు. దీంతో ఫ్రూట్స్​పై సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఎక్కువ. అందుకే పండ్లను ఇంట్లోనే తాజాగా కోసుకుని తినడం మంచిది. 

డీప్ ఫ్రై ఫుడ్స్

వర్షాకాలంలో బజ్జీలు, పకోడీలు తినాలనిపించడం సహజమే. కానీ వీటిని ఎక్కువగా తింటే జీర్ణక్రియపై భారం పడుతుంది. నూనె ఎక్కువగా ఉండే ఆహారం అజీర్ణం, గ్యాస్, బరువు పెరగడానికి దారితీయవచ్చు.

Also Read : వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి

నిల్వ ఆహారం

ఒకటి లేదా రెండు రోజుల క్రితం వండిన ఆహారాన్ని తినడం కంటే తాజాగా వండిన ఆహారమే మంచిది. నిల్వ చేసిన ఆహారంలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచినా సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. తినే ముందు బాగా వేడి చేయాలి.

పాల ఉత్పత్తులు

పాశ్చరైజ్ చేయని పాలు లేదా వాటితో తయారైన కొన్ని ఉత్పత్తుల్లో హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది. అందుకే బాగా మరిగించిన పాలు లేదా పాశ్చరైజ్ చేసిన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.

వర్షాకాలంలో ఇలా తినాలి..

వర్షాకాలంలో వేడివేడిగా తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. పప్పులు, పెసరపప్పు వంటి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు మంచివి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పసుపు వంటి వాటిని ఫుడ్స్​లో చేర్చుకోవాలి. సీజనల్ కూరగాయలు, విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. మరిగించి చల్లార్చిన నీటిని తాగితే మంచిది. 

Also Read : వర్షాల వల్ల జలుబు, దగ్గు వస్తున్నాయా? రోగనిరోధక శక్తి కోసం వీటిని తినమంటోన్న వైద్యులు

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget