Rainy Season Diseases : వర్షాకాలంలో కామన్‌గా వచ్చే వ్యాధులు ఏంటి? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Monsoon Health Problems : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అయితే అవి రావడానికి కారణాలు ఏంటో? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Common Health Problems During Rainy Season : దేశవ్యాప్తంగా వర్షాలు మొదలైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం ఇలా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోయి వివిధ సీజనల్ వ్యాధులు అటాక్ అవుతాయి. మరి వర్షాకాలంలో కామన్‌గా వచ్చే వ్యాధులు ఏంటి? దానికి గల కారణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షంలో తడవడం ద్వారా
వాతావరణంలో మార్పులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, తడి దుస్తులు వల్ల జ్వరం, జలుబు వంటి ఇబ్బందులు వస్తాయి. వర్షంలో తడవడం వల్ల, ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నవారికి దగ్గరగా ఉండడం వల్ల కూడా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు తడవకుండా చూసుకోవాలి. తడిచిన దుస్తులు వెంటనే మార్చుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే ఫుడ్స్, కేర్ తీసుకోవాలి. సమస్య ఎక్కువైతే వైద్య సహాయం తీసుకోవాలి.
దోమల ద్వారా వచ్చే వ్యాధులు(Mosquito-Borne Diseases)
వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. నీరు పేరుకుపోయిన ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా పెరుగుతాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సమస్యలు వస్తాయి. దోమలు రాకుండా రిప్లెంట్స్, నెట్స్ వాడాలి. అలాగే నీరు పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ వాతావరణం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు (Waterborne Diseases)
వర్షాకాలంలో నీటి ద్వారా, తీసుకునే ఆహారం ద్వారా కూడా కొన్ని వ్యాధులు వ్యాపిస్తాయి. కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ వంటి సమస్యలు ఎక్కువగా నమోదు అవుతాయి. ఇవి తీసుకునే ఆహారం, నీరు ద్వారానే వ్యాపించే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నీటిని మరిగించి.. వడబోసుకుని తాగాలి. ఇంటి దగ్గర శుభ్రంగా వండిన ఫుడ్ తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు (Stomach Infections)
వర్షాకాలంలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలామంది ఫుడ్ పాయిజినింగ్, డయారేయా వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రోడ్‌సైడ్ దొరికే ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఫుడ్ కూడా తీసుకోకూడదు. తాజాగా, శుభ్రంగా వండిన ఆహారం తీసుకోవాలి. తినే ముందు చేతులు బాగా కడుక్కోవాలి.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు (Fungal Infections)
వర్షాకాలంలో నీటిలో తడవడం వల్ల, తేమ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వస్తాయి. కాళ్లు ఒరిసిపోవడ, తామర వంటి సమస్యలు వస్తాయి. తడిచిన దుస్తులు, షూలు, హ్యూమిడిటీ వల్ల ఇవి రావొచ్చు. కాబట్టి పొడిగా, వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. యాంటీఫంగల్ పౌడర్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
శ్వాస సమస్యలు (Asthma and Breathing Issues)
వాతావరణంలో మార్పులు, హ్యూమిడిటీ, కాలుష్యం వల్ల వర్షాకాలంలో చాలామంది ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడతారు. కాబట్టి కొన్ని ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాగే ఎప్పుడూ ఇన్హేలర్ ఉపయోగిస్తే మంచిది.
చర్మ సమస్యలు (Skin Allergies and Rashes)
తేమ, వర్షంలో తడవడం వల్ల చాలామంది ర్యాష్‌లు, అలెర్జీలు వస్తాయి. తడిబట్టలు వేసుకోవడం, హ్యుమిడిటీ వంటివి దీనికి కారణమవుతాయి. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా, తడిలేకుండా చూసుకోవాలి. ఒకవేళ వర్షంలో తడిస్తే వెంటనే వాటిని మార్చేసుకోవాలి.
ఇవి వర్షాకాలంలో కామన్‌గా వచ్చే సమస్యలు. కాబట్టి వీలైనంత వరకు వర్షంలో తడవకపోవడమే మంచిది. అలాగే బయటకు వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు.. అత్యవసర సమయంలో అవసరమయ్యే మెడిసన్స్ అందుబాటులో ఉంచుకోవడం మంచిది. పరిస్థితులు దాటిపోయే వైద్య సమస్యలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.






















