వర్షాకాలం మొదలైపోయింది. ఈ సమయంలో వివిధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వాటిలో కామన్ ఇవే.

వాతావరణంలో మార్పులు వర్షంలో తడవడం వల్ల వైరల్ ఇన్​ఫెక్షన్లు ఈజీగా వచ్చేస్తాయి.

జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీలైనంత వరకు వర్షంలో తడవకపోవడమే మంచిది.

దోమలు పెరుగుతాయి కాబట్టి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వచ్చే అవకాశముంది.

టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఏ వంటి ఆరోగ్య సమస్యలు రావొచ్చు.

ఫుడ్ పాయిజినింగ్, డయేరియా వంటి ఇబ్బందులు వస్తాయి. జీర్ణ సమస్యలు పెరగవచ్చు.

ఫంగల్ ఇన్​ఫెక్షన్లు కూడా ఎక్కువ అవుతాయి. తడిచిన బట్టలు, నీటిలో తడవడం వల్ల రావొచ్చు.

హ్యుమిడిటీ పెరగడం వల్ల ఆస్తమా వంటి శ్వాస సమస్యలు ఎక్కువ కావొచ్చు.

స్కిన్ అలెర్జీలు, ర్యాష్​లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధులు రావు.