Immunity Boosting Drinks : రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ డ్రింక్స్.. కరోనాను దూరం చేస్తూ ఇమ్యూనిటీ పెంచుకోండిలా
Seasonal Disease Prevention : రోగనిరోధక శక్తిని పెంచుకుంటే సీజనల్ వ్యాధులు, వైరస్లు దరి చేరవు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఇమ్యూనిటీని పెంచుకోడానికి హెల్ప్ చేసే డ్రింక్స్ ఏంటో చూసేద్దాం.

Healthy Drinks for Immune System : కరోనా మళ్లీ భయపెట్టడం మొదలు పెట్టింది. ఇప్పటికే ఇండియాలో కేసులు పెరగడంతో పాటు.. కొవిడ్ బారిన పడి మృత్యువాత కూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ రూల్స్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేయడం వంటివి ఫాలో అవుతూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనానే కాకుండా ఇతర వైరస్ల వ్యాప్తి ఈ మాన్సూన్ సయమంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీపై ఫోకస్ చేయాలి.
సీజనల్ వ్యాధులను దూరం చేయడంతో పాటు.. కరోనా వంటి వైరస్‌లను ఎదుర్కోవడంలో రోగనిరోధక శక్తి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు. అయితే మీరు దీనికోసం మందులు వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని హెర్బల్ డ్రింక్స్ తాగుతూ కూడా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
అల్లం టీ
అల్లం ముక్కలను నీటిలో వేసి మరిగించి దానిలో కాస్త నిమ్మరసం వేస్తే అల్లం టీ రెడీ. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే శరీరానికి యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అందుతాయి. ఇవి గొంతు నొప్పిని దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. జీర్ణ సమస్యలను దూరం చేసి.. ఇన్ఫెక్షన్ల నుంచి భద్రతనిస్తాయి.
బీట్రూట్ జ్యూస్
బీట్రూట్ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిని తాగితే విటమిన్స్ కూడా శరీరానికి అందుతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి.. రక్తప్రసరణను పెంచుతాయి. ఇది శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది.
తేనె, నిమ్మరసం
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె వేసి కలిపి తాగితే చాలా మంచిదట. దీనిలో విటమిన్స్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రిఫ్రెషింగ్ ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగు చేసి.. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది.
తులసి టీ
తులసి ఆరోగ్యానికి ఎన్ని మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే వాటిని నేరుగా తినడమో.. లేదా టీ రూపంలో తీసుకుంటే మంచిది. తులసి ఆకులను మరిగించి దానిని టీ రూపంలో తీసుకోవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.
ఉసిరి జ్యూస్
ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేసి.. హెల్తీ స్కిన్‌ని, జుట్టును ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఉసిరి షాట్స్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది.
పాలల్లో పసుపు
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎప్పటి నుంచి పాలల్లో పసుపు కలిపి తీసుకుంటున్నారు. దీని ప్రస్తావన ఆయుర్వేదంలో కూడా ఉంటుంది. దీనిలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధులను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.
ఇవే కాకుండా కొబ్బరి నీళ్లు, పుదీనా టీ వంటివి కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మీకు సీజనల్ వ్యాధులు, వైరస్లు వచ్చే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కరోనా రాకూడదంటే ఆ కొవిడ్ రూల్స్ ఫాలో అవుతూ, వ్యాయామాలు చేస్తూ.. రోగనిరోధక శక్తిని పెంచుకునే ఫుడ్స్, డ్రింక్స్‌ని డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.






















