కొవిడ్ మళ్లీ వచ్చేసింది. ఇండియాలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో కరోనా రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తున్నారు.

జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లేప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి.

చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు శానిటైజర్​ వాడితే మంచిది.

కళ్లు, ముక్కు, నోటికి కాంటాక్ట్ లేకుండా చూసుకోండి. ఇవే వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి.

పబ్లిక్​ ప్లేస్​లో ఉన్నప్పుడు కనీసం దూరం ఉండేలా చూసుకోండి. ఇది వైరస్ వ్యాప్తిని అరికడుతుంది.

మీకు దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోండి.

బూస్టర్​ డోస్​కి మీరు ఎలిజిబుల్​ అయితే వెంటనే దానిని తీసుకుంటే మంచిది.

వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేలా చూసుకోండి. ఎమెర్జెన్సీ అయితేనే బయటకు వెళ్లండి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.