ప్రస్తుత కాలంలో క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

క్యాన్సర్​లో అనేక కారణాలు ఉన్నాయి. మహిళల్లో, పురుషుల్లో కూడా ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి.

అలాంటి వాటిలో బ్రెయిన్ క్యాన్సర్ కూడా ఒకటి. అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

అయితే బ్రెయిన్ క్యాన్సర్ రాకముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయట.

బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు కణితి.. దాని స్థానం.. పరిమాణంపై ఆధారపడి ఉంటాయి.

బ్రెయిన్ క్యాన్సర్​కు ముందు మెదడుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది.

మెదడుపై ఒత్తిడి పెరిగి.. వికారం, వాంతులు వంటి సమస్యలు రావొచ్చు.

కంటి చూపు మందగించే అవకాశం ఉంది. ఇది మెదడు క్యాన్సర్​కి మరో సంకేతం కావొచ్చు.

శరీరంలో ఒకవైపు బలహీనంగా ఉండడం, పక్షవాతం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. ఎలాంటి మార్పులు కనిపించినా వైద్యుల సహాయం తీసుకోవాలి.