చికెన్​ను చాలామంది ఇష్టంగా తింటారు. మటన్ తినని వాళ్లుకూడా దీనిని ఎక్కువగా తింటారు.

అంతేకాకుండా జిమ్​కి వెళ్లేవారు ప్రోటీన్ కోసం ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా చికెన్​ను తీసుకుంటారు.

అయితే చికెన్​ను తెచ్చుకుని వండకుండా లేదా వండి చాలామంది ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటారు.

అసలు చికెన్​ను ఎన్నో రోజులు ఫ్రిడ్జ్​లో పెట్టుకోవచ్చు? పాడవకుండా ఎన్ని రోజులుంటుందో ఇప్పుడు చూసేద్దాం.

USDA ప్రకారం చికెన్​ను వండకుండా ఫ్రిడ్జ్​లో రెండు రోజులు పెట్టవచ్చు.

ఒకవేళ చికెన్​ను వండి.. లేదా ఉడికించి ఫ్రిడ్జ్​లో పెట్టాలనుకుంటే 3 నుంచి 4 రోజులు పెట్టొచ్చు.

చికెన్​ను ఫ్రిడ్జ్​లో పెట్టడం మంచిదే కానీ.. ఎక్కువ రోజులు ఉంచడం మంచిది కాదు.

వండిన చికెన్​ను ఫ్రిడ్జ్​లో పెట్టాలనుకుంటే గాలి చొరబడని కంటైనర్లో పెట్టాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. ఫ్రెష్ చికెన్ తెచ్చుకుని వెంటనే వండుకుని కూడా తినొచ్చు.