పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిది. వేసవిలో దీనిని తింటే చాలా మంచిదని చెప్తారు.

ఎందుకంటే దీనిలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది హైడ్రేషన్​ను అందిస్తుంది.

అందుకే దీనిని సమ్మర్​లో తినమని సూచిస్తారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.

అయితే కొన్నిసార్లు పుచ్చకాయకి దూరంగా ఉండమని చెప్తున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చకాయలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తినొచ్చు కానీ.. రాత్రుళ్లు తినకూడదట.

ఎందుకంటే రాత్రుళ్లు పుచ్చకాయను తింటే జీర్ణక్రియ మందగిస్తుందట.

అలాగే ఏదైనా భోజనం చేసిన వెంటనే పుచ్చకాయను తినకూడదట.

ఖాళీ కడుపుతో తినకూడదట. అలా ఫుడ్ తిన్న వెంటనే కూడా తినకూడదు.

ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే కూడా పుచ్చకాయ తింటే గొంతు నొప్పి, జలుబు వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.