గుమ్మడి గింజల్లో విటమిన్ ఏ, సి, ఈ, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

కేలరీలు తక్కువగా ఉన్నా.. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.

బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది విటమిన్​ ఏగా మారి శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది.

వయసు ద్వారా వచ్చే కంటి సమస్యలను దూరం చేసి.. హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి.

కొలెస్ట్రాల్ లెవెల్స్​ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. బరువు తగ్గడంలో మంచి ఫలితాలు ఇస్తాయి.

విటమిన్ ఏ, సి, ఈ స్కిన్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి వయసు ద్వారా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.

దీనిలోని ఫైబర్ గ్లైసెమిక్ ఇండెక్స్​ని తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు రక్తంలోని షుగర్ లెవెల్స్​ని తగ్గిస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.