వర్షాకాలంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే సీజనల్ సమస్యలు వచ్చే ప్రమాదముంది.

పిల్లలు పొడి, చల్లని వాతావరణంలో ఎఫెక్ట్ చేయకుండా వేడిగా ఉండేలా చూసుకోవాలి.

రూమ్ టెంపరేచర్​ని అడ్జెస్ట్ చేయండి. చలి ఎక్కువ లేకుండా చూసుకుంటే మంచిది.

పిల్లల్ని పట్టుకునేప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే మీ ద్వారా వారికి ఇన్​ఫెక్షన్లు రావొచ్చు.

పాలు పట్టించే బాటిల్స్​ని కూడా శుభ్రంగా క్లీన్ చేయాలి. పిల్లల చుట్టూ బ్యాక్టిరియా చేరకుండా చూసుకోవాలి.

పిల్లలను జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు తీసుకువెళ్లకపోవడమే మంచిది.

పిల్లలకు తల్లిపాలు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. కాబట్టి వాటిని రెగ్యులర్​గా ఇవ్వండి.

పిల్లలకు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జ్వరం వంటి సమస్యలు రావొచ్చు.

పిల్లల స్కిన్​ డ్రైగా ఉండేలా చూసుకోండి. ఇవి ఫంగల్ ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.