గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నారు నిపుణులు.

చెప్పులు లేకుండా కాసేపు నేల మీద నడిస్తే ఎంత మంచిదో.. గడ్డి మీద నడిస్తే కూడా అంత మంచిది.

ఇలా నడవడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీనివల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.

గడ్డి మీద నడిస్తే ఒత్తిడి తగ్గుతుందట. ఒకవేళ మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉందనిపిస్తే దగ్గర్లో పార్క్ ఉంటే గడ్డి మీద నడవండి.

పాదాల్లో నిర్దిష్టమైన పాయింట్స్​పై ప్రెజర్ పడి.. ఎనర్జిని పెంచుతాయి.

గడ్డి మీద నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది చర్మాన్ని హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

నిద్ర నాణ్యత మెరుగవుతుంది. హార్మోన్లు సమతుల్యంగా పనిచేసి నిద్రను ప్రేరేపిస్తాయి.

ఇదొక తేలికపాటి వ్యాయామంగా చెప్పవచ్చు. గడ్డి మీద నడవడం వల్ల మోకాళ్లు, పాదాలకు మంచి వ్యాయామం అందుతుంది.

కుదిరితే ఉదయం మీద 10 నుంచి 15 నిమిషాలు నడిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. రెగ్యులర్​గా వాక్ చేస్తే మంచి ఫలితాలుంటాయి.