ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక సమస్యలనుంచి కాపాడుతాయి.

ఇవి కళ్లు, గుండె, చర్మం, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వీటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

అయితే వీటిని పండించడానికి రైతులు చాలా ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది.

ద్రాక్ష తోటను వేసిన తర్వాత ద్రాక్ష తీగ బలపడడానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుందట.

మూడవ సంవత్సరంలో ద్రాక్షలు కాస్తాయి కానీ ఎక్కువ దిగుబడి రాకపోవచ్చు.

నాలుగో సంవత్సరంలో ద్రాక్ష దిగుబడి పెరుగుతుందట. దాని తర్వాత మరింత పెరగొచ్చు.

కాబట్టి ద్రాక్ష పంటను వేయాలనుకునేవారు వెంటనే మంచి ఫలితాలు చూడలేరు.

వాటి నుంచి పెట్టుబడి పొందాలనుకుంటే కనీసం 3 సంవత్సరాలు ఆగాల్సిందే.

మీరు ఇంట్లో ద్రాక్ష వేసి.. అది వెంటనే కాసేయాలని చూడకండి. చూసిన కాయట్లేదని తీయకండి.

రెండు, మూడు సంవత్సరాలకు మీరు మంచి ద్రాక్షలు రావడం చూడొచ్చు.