అరటి పండ్లను చాలామంది ఇష్టంగా తింటారు. ఇవి ఆరోగ్యానికి మంచివి.

అరటి పండ్లలోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

మరి అరటి తోటను పండించడానికి, గెల తయారవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా?

అరటి తోటను వేయాలంటే మంచి వాతావరణ, నీరు అన్ని అనుకూలంగా ఉండాలట.

అరటి తోటను వేసి దానికి పువ్వు రావడానికి 7–9 నెలల సమయం పడుతుంది.

అరటి గెల కాసి.. దానిని పండించడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందట.

మొత్తంగా అరటి చేతికి రావడానికి 9 నుంచి 12 నెలల సమయం పడుతుందట.

పంటకు ఆర్గానిక్ ఎరువులను వేసి మంచి క్రాప్​ని పొందవచ్చు.

అరటిగెల కాసి పండే స్థాయికి వచ్చినప్పుడు దానిని కోసేయడమే మంచిది.

లేదంటే చెట్టు నేల కూలిపోతుంది. పచ్చి అరటిగెలను కూడా పండిచుకోవచ్చు.