అన్వేషించండి

Monsoon Diet Tips : వర్షాల వల్ల జలుబు, దగ్గు వస్తున్నాయా? రోగనిరోధక శక్తి కోసం వీటిని తినమంటోన్న వైద్యులు

Monsoon Diet for Better Immunity : వర్షాలు మొదలైపోయాయి. ఈ సమయంలో జలుబు, దగ్గుతో పాటు ఇతర వైరల్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే ఈ సమయంలో కొన్ని ఫుడ్స్ తినాలంటున్నారు నిపుణులు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షాకాల వ్యాధుల నివారణకు ఆహారంలో మార్పులు అవశ్యం.
  • అల్లం, వెల్లుల్లి, పసుపు, విటమిన్-సి పండ్లు చేర్చండి.
  • ప్రోటీన్, పెరుగు, మజ్జిగ, వేడి సూప్‌లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
  • వేయించినవి, చక్కెర, అపరిశుభ్ర ఆహారాలకు దూరంగా ఉండాలి.

Foods To Boost Immunity in Monsoon : వర్షాలు ఎండల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ.. వర్షాకాలం వచ్చినప్పటి నుంచి సీజన్‌ వ్యాధులు ఎక్కువ అవుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. అందుకే ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఫుడ్ విషయంలో కొన్ని మార్పులు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. 

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి డైట్లో కొన్ని ఆహారాలు చేర్చుకోవాలి.. అలాగే కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలని చెప్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్‌ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుందని హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్​గా చేస్తోన్న సుజాత స్టీఫెన్ వెల్లడించారు. ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. 

అలాంటి ఫుడ్ తినాలి..

వర్షాలు పడేప్పుడు లేదా వానాకాలంలో తాజాగా వండిన, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువసేపు నిల్వ చేసిన లేదా చల్లారిన ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్‌బోర్న్ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం పెరగవచ్చని తెలిపారు. వేడి ఆహారం జీర్ణం కావడానికి సులభంగా ఉంటుందన్నారు.

అల్లం, వెల్లుల్లి, పసుపు

వర్షాకాలంలో అల్లం, వెల్లుల్లి, పసుపును కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి అంటున్నారు. ఎందుకంటే వాటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి హెల్ప్ చేస్తాయి. కూరలు, పప్పులు, సూప్‌లు లేదా హెర్బల్ డ్రింక్స్‌తో కలిపి వీటిని తీసుకోవచ్చు. 

విటమిన్-సి కోసం ఫ్రూట్స్ 

ఉసిరికాయ, జామ, నారింజ, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, పియర్ వంటి పండ్లలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక కణాల పనితీరుకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి.

సూప్‌లు, రసం

వర్షాకాలంలో వేడి వేడి సూప్‌లు, రసం, హెర్బల్ టీలు, పెసరపప్పు వంటకాలు తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి హైడ్రేషన్ అందించడమే కాకుండా.. గొంతుకు ఉపశమనం కలిగిస్తాయి. వెచ్చని అనుభూతి ఇస్తాయి. 

ప్రోటీన్‌ను లైట్ తీసుకోకండి..

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ ఆహారాలు యాంటీబాడీల ఉత్పత్తికి సహాయపడతాయి. కండరాల ఆరోగ్యానికి కూడా మంచివి. 

పెరుగు, మజ్జిగ

వేసవిలో ఎక్కువమంది పెరుగు, మజ్జిగ తీసుకుంటారు. కానీ వర్షాలు పడేప్పుడు మానేస్తారు. కానీ వర్షాకాలంలో తాజా పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నార. ఎందుకంటే ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గట్ హెల్త్ బాగుంటే రోగనిరోధక శక్తి కూడా మెరుగ్గా పనిచేస్తుందని సుజాత స్టీఫెన్ తెలిపారు. 

తినకూడనివి ఇవే..

వర్షాకాలంలో ఎక్కువగా వేయించిన పదార్థాలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలు, పరిశుభ్రత లేని స్ట్రీట్ ఫుడ్, సరిగా కడగని పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాలని తెలిపారు. 

తగినంత నీరు

వర్షాకాలంలో దాహం తక్కువగా అనిపించినా.. శరీరానికి అవసరమైనంత నీరు అందించడం ముఖ్యమని చెప్తున్నారు నిపుణలు. సరైన హైడ్రేషన్ రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మంచిదని చెప్తున్నారు. 

అయితే రోగనిరోధక శక్తి అనేది ఏదోక ఆహారం తీసుకుంటే పెరిగిపోయేది కాదు. పోషకాహారం, తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, పరిశుభ్రత, సరైన హైడ్రేషన్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల కలయికే ఇమ్యూనిటీ. ఇది బాగుంటే వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఇతర సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ అందడం సులభం అవుతుంది. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

How To Get Rid Of Lizards At Home: ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
ఇంట్లో బల్లులను చంపకుండా వదిలించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Sink Trap Leak: వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
వంటగది సింక్ నుంచి నీరు కారుతుందా? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో లీక్ అరికట్టవచ్చు! 
Pillow Cleaning Tips: దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 
దిండు కంపుకొడుతోందా? ఈ చిట్కాతో ఉతక్కుండానే క్లీన్ చేయవచ్చు! 
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Embed widget