అన్వేషించండి

Monsoon Health Alert : వేసవి నుంచి వర్షాకాలం మారే సమయంలో ఎక్కువగా వచ్చే సీజనల్ వ్యాధులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Health Risks From Summer to Monsoon : సీజన్ మారే సమయంలో చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనేక వ్యాధులను దూరంగా ఉంచుకోవచ్చని చెప్తున్నారు వైద్యులు. లేదంటే ఇమ్యూనిటీ తగ్గడం, సీజనల్ వ్యాధులు పెరగడం జరుగుతాయట.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం.
  • దోమల, వైరల్ ఇన్ఫెక్షన్లు, ఆహార కాలుష్యం వ్యాధులకు కారణం.
  • పిల్లలు, వృద్ధులకు జలుబు, జ్వరం, చర్మ సమస్యలు సాధారణం.
  • పరిసరాల పరిశుభ్రత, మరిగించిన నీరు, వైద్య సలహా తప్పనిసరి.

Monsoon Season Diseases : వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గడం నుంచి గాలిలో తేమ పెరగడం, నిల్వ నీరు ఏర్పడడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, దోమలు వేగంగా పెరుగుతాయి. దీంతో ఈ సీజన్ మార్పు సమయంలో కొన్ని వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. 

జలుబు, దగ్గు, ఫ్లూ

వాతావరణ మార్పుల కారణంగా శరీరం కొత్త పరిస్థితులకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్లు సులభంగా వ్యాపిస్తాయి. ముక్కు కారడం, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించవచ్చు.

డెంగ్యూ

వర్షాల కారణంగా నిల్వ నీరు పెరగడంతో దోమలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఏడిస్ దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ కేసులు ఈ సమయంలో ఎక్కువగా నమోదవుతాయి. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు దీని లక్షణాలు.

మలేరియా

దోమల ద్వారా వ్యాపించే మరో ప్రమాదకర వ్యాధి మలేరియా. వర్షాకాలంలో దోమల సంఖ్య పెరగడంతో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువవుతుంది. చలి, జ్వరం, చెమటలు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

టైఫాయిడ్

కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో నీటి కాలుష్యం పెరగడం వల్ల ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ అవుతుంది. దీర్ఘకాలిక జ్వరం, బలహీనత, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

వైరల్ ఫీవర్

సీజన్ మార్పు సమయంలో వైరల్ జ్వరాలు రావడం చాలా సాధారణం. శరీర నొప్పులు, జ్వరం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ఇవి కొన్ని రోజుల్లో తగ్గినా, లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

వాంతులు, విరేచనాలు

వర్షాకాలంలో ఆహారం, నీటి ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీంతో విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. బయట ఆహారం తినేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం.

చర్మ వ్యాధులు

గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, ర్యాషెస్ వంటి చర్మ సమస్యలు పెరుగుతాయి. తడి బట్టలు ఎక్కువసేపు ధరించడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.

కండ్ల కలక

వర్షాకాలంలో కంజంక్టివైటిస్ (కంటి కలక) వంటి కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, దురద వంటి లక్షణాలు ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణం మారే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఎప్పుడూ శుభ్రమైన, మరిగించిన నీటినే తాగాలి. అలాగే పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. దోమల నివారణ చర్యలు తీసుకోవాలి. బయట ఆహారం తక్కువగా తీసుకుంటూ.. రోగనిరోధక శక్తిని పెంచే పోషకాహారం తీసుకోవాలి. బయటకు వెళ్లి వస్తే.. చేతులను సబ్బుతో కడుక్కోవాలి. జ్వరం లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget