అన్వేషించండి

Monsoon Skin Problems : వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయి? లక్షణాలు, నివారణ చిట్కాలు చెప్పిన డెర్మటాలజిస్ట్

Fungal Infections In Monsoon : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే వీటికి ప్రధాన కారణాలు ఏంటో.. వాటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షాకాలంలో అధిక తేమ, చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి.
  • తడి బట్టలు, సాక్స్ ధరించడం ఫంగస్ పెరుగుదలకు ముఖ్య కారణం.
  • వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం ముఖ్యం.
  • లక్షణాలుంటే సొంత వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Monsoon Fungal Infections Causes : వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అధిక తేమ, చెమట, తడి బట్టలు, గాలి సరిగా ఆడకపోవడం వంటి కారణాలు ఫంగస్ పెరుగుదలకు కారణం అవుతాయి. 

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ పద్మజ మాట్లాడుతూ.. శరీరంలోని తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయని తెలిపారు. ముఖ్యంగా తొడల మధ్య భాగం, చంకలు, కాలి వేళ్ల మధ్య, రొమ్ముల కింద భాగం, చర్మ మడతలు ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని చెప్పారు.

వర్షాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు

వానాకాలంలో రింగ్‌వార్మ్ (టినియా), అథ్లెట్స్ ఫుట్, జాక్ ఇచ్, కాండిడియాసిస్, ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి లక్షణాలుగా నిరంతర దురద, ఎర్రటి లేదా పొలుసుల్లా కనిపించే మచ్చలు, మంట, చర్మం ఊడిపోవడం, పాదాల నుంచి దుర్వాసన రావడం, గోర్లు రంగు మారడం లేదా మందంగా మారడం వంటివి ఉండవచ్చు. మొదట్లో ఇవి చిన్న సమస్యల్లా అనిపించినా, చికిత్స తీసుకోకపోతే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ పద్మజా హెచ్చరించారు.

చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే

వర్షాకాలంలో చాలామంది చేసే తప్పు ఒకటి ఉంది. అదే తడిసిన తర్వాత కూడా తడి బట్టలు, సాక్స్ లేదా చెప్పులు గంటల తరబడి వేసుకునే ఉంటారు. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణమని డాక్టర్ పద్మజ తెలిపారు. ఫంగస్ వేడి, తేమ ఉన్న వాతావరణంలో వేగంగా పెరుగుతుంది. కొద్దిసేపు తేమ నిలిచినా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

ఎవరికి ప్రమాదం ఎక్కువ 

మధుమేహం ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఎక్కువగా చెమట పట్టేవారు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. అలాగే జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, కామన్ చేంజింగ్ రూమ్‌లను తరచూ ఉపయోగించే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపించవచ్చు.

ఎలా నివారించాలి?

ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. చర్మాన్ని పొడిగా ఉంచడం మొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త. వీలైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. తడిసిన బట్టలు ఎక్కువసేపు వేసుకోకూడదు. స్నానం చేసిన తర్వాత పాదాల మధ్య భాగాన్ని కూడా బాగా తుడిచి ఆరబెట్టాలి.

అలాగే తువ్వాళ్లు, సాక్స్, చెప్పులు లేదా వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకండి. ఎక్కువగా చెమట పట్టే ప్రాంతాల్లో యాంటీ ఫంగల్ పౌడర్లను ఉపయోగించడం ద్వారా తేమను తగ్గించుకోవచ్చు.

సొంత వైద్యం వద్దు

దురద, ఎర్రటి మచ్చలు, చర్మం పొలుసుల్లా ఊడిపోవడం లేదా తరచూ రాషెస్ రావడం వంటి లక్షణాలు కొనసాగితే సొంత వైద్యం కాకుండా.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. మార్కెట్లో దొరికే కొన్ని క్రీములు, ముఖ్యంగా స్టెరాయిడ్లు కలిగిన క్రీములు తాత్కాలికంగా లక్షణాలను తగ్గించినా.. ఇన్ఫెక్షన్‌ను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గి మళ్లీ రాకుండా ఉండాలంటే సరైన నిర్ధారణతో పాటు తగిన యాంటీ ఫంగల్ చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్ పద్మజ సూచించారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget