అన్వేషించండి

Immunity Boosting Tips : 30 రోజుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా? రోగాలు రాకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిందే

Boost Your Immunity : శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వైరస్​లు త్వరగా సోకుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలి. నెలరోజుల్లో ఏమార్పలు చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పోషకాహారం, తగినంత నీరు, 7-8 గంటల నిద్ర తప్పనిసరి.
  • రోజూ 30 నిమిషాల వ్యాయామం, ఒత్తిడి తగ్గించడం ముఖ్యం.
  • ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా, ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలి.
  • సూర్యరశ్మి, మంచి గట్ హెల్త్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Boost Your Immune System in 30 Days : కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు ఏ వైరస్ పేరు వినిపించినా ప్రజల్లో భయం మొదలవుతుంది. ప్రస్తుతానికి ఇండియాపై హంటా వైరస్​ ప్రభావం లేకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా దాని గురించిన వార్తలు భయానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో భయపడడం కాకుండా ఇమ్యూనిటీ పెంచే వాటిపై దృష్టి పెడితే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఇమ్యూనిటీ ఎందుకు అవసరం..

ప్రాణాంతక వైరస్​లే కాదు.. సీజనల్ వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించడానికి శరీరానికి ఇమ్యూనిటీ అవసరం. దీనినే రోగనిరోధక శక్తి కూడా అంటారు. సరైన ఇమ్యూనిటీ లేకుంటే ఈజీగా వైరస్​లు సోకుతాయి. లైఫ్​స్టైల్​, ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం వంటి వాటి వల్ల ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. అందుకే కొన్ని అలవాట్లు ఫాలో అయితే కేవలం 30 రోజుల్లోనే రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. ఇంతకీ పవర్​ఫుల్ టిప్స్ ఏంటో చూసేద్దాం. 

పోషకాహారం..

ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే శరీరానికి పోషకాలు అవసరం. కాబట్టి ప్రతిరోజూ ఆకుకూరలు, పండ్లు, గింజలు, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ డి, జింక్ ఉన్న ఆహారం ఇమ్యూనిటీ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

తగినంత నీళ్లు 

శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లాలంటే నీరు చాలా అవసరం. రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగితే మంచిదని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది.

సరిపడ నిద్ర

రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర శరీరానికి అవసరం. నిద్ర సరిపోకపోతే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. శరీరం రిపేర్ కావడానికి, కొత్త సెల్స్ తయారవడానికి మంచి నిద్ర అవసరం.

వ్యాయామం 

వాకింగ్, యోగా, సైక్లింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేస్తే రక్త ప్రసరణను పెరిగి.. ఇమ్యూనిటీ బలపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు శారీరక చలనం ఉండేలా చూసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చని చెప్తున్నారు. 

ఒత్తిడి ఉండొద్దు

స్ట్రెస్ వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ పెరిగి ఇమ్యూనిటీ తగ్గుతుంది. ధ్యానం, యోగా, సంగీతం వినడం, కుటుంబంతో సమయం గడపడం వంటి అలవాట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్ 

జంక్ ఫుడ్, కోల్డ్ డ్రింక్స్, ఎక్కువ చక్కెర ఉన్న ప్రాసెస్ చేసిన ఫుడ్స్ శరీరానికి హానికరం. ఇవి ఇన్‌ఫ్లమేషన్ పెంచి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. 

హెల్తీ డ్రింక్స్..

ఉదయాన్నే ఆరోగ్యానికి మేలు చేసే హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే మంచిది. అల్లం టీ, తేనె కలిపిన నిమ్మరసం నీరు, పసుపు పాలు వంటి డ్రింక్స్ శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అందించి ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడతాయి.

గట్ హెల్త్‌

మన గట్ హెల్త్​ కూడా ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుంది. కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరిచే ఫుడ్స్ తీసుకోవాలి అంటున్నారు. పెరుగు, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి గట్ హెల్త్ మెరుగుపడుతుంది.

సూర్యరశ్మి 

ఉదయాన్నే కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉండడం వల్ల శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఇది ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.

ఈ హెల్తీ అలవాట్లు ఫాలో అయితే ఇమ్యూనిటీ కచ్చితంగా పెరుగుతుంది. 30 రోజుల్లో మీరే మంచి మార్పులు చూస్తారు. వైరస్​లు ఎక్కువగా సోకే వర్షాకాలం, చలికాలానికి మీ శరీరాన్ని ముందుగానే సిద్ధం చేసుకుంటే ఆరోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా ఉంటారు. అయితే వీటితో పాటు స్మోకింగ్, మద్యం అధికంగా తీసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. ఇమ్యూనిటీ ఒక్కరోజులో పెరగదు కాబట్టి ఈ సూచనలు రెగ్యులర్​గా ఫాలో అవ్వండి. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget