అన్వేషించండి

Hantavirus Causes : ప్రపంచాన్ని భయపెడుతోన్న హంటావైరస్.. లక్షణాలు, చికిత్స, పూర్తి వివరాలివే

Hantavirus Causes : కరోనా వైరస్ తర్వాత ఏ వైరస్​ వచ్చినా ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. తాజాగా హంటావైరస్ తెరపైకి రావడంతో మళ్లీ ప్రజల్లో ఆందోళన మొదలైంది. వైరస్ గురించిన పూర్తి వివరాలు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏప్రిల్-మే 2026లో క్రూజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాప్తి చెందింది.
  • హంటావైరస్ ఎలుకల ద్వారా మనుషులకు సోకే అరుదైన వైరస్.
  • దీనికి వ్యాక్సిన్ లేదు, కానీ సపోర్టివ్ కేర్ తో ప్రాణాలు కాపాడవచ్చు.
  • ఈ వైరస్ కరోనా వలె వేగంగా వ్యాపించదు, రిస్క్ తక్కువ.

Hantavirus Outbreak : ఏప్రిల్-మే 2026లో క్రూజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాప్తి చెందడంతో ప్రపంచం మళ్లీ ఓ కొత్త వైరస్ పేరు వింటోంది. దీంతో కరోనా తర్వాత మరో మహమ్మారి వస్తుందా అనే భయంతో ఆందోళన పడుతున్నారు. ఈ వైరస్ ఎందకు ప్రమాదం? వ్యాప్తి ఎలా ఉంటుంది? నివారణ ఉందా? లేకుంటే మరో లాక్​డౌన్ రానుందా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూసేద్దాం. 

ఎక్కడ మొదలైందంటే..

ఏప్రిల్ 2026 నుంచి డచ్ క్రూజ్ షిప్ ఎంవీ హోండియస్​పై హంటావైరస్ ప్రభావం మొదలైంది. ఈ నౌక అర్జెంటీనా నుంచి బయలుదేరి అంటార్కిటికా, దక్షిణ అట్లాంటిక్ దీవులను సందర్శిస్తోంది. వారి ప్రయాణంలోనే మే 6 నాటికి 5 నిర్ధారిత కేసులు.. 3 అనుమానిత కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మే 2వ తేదీన ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నౌకలో 147 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 

హంటావైరస్ అంటే ఏమిటి?

హంటావైరస్ అనేది ఎలుకలు, ఇతర కొరకగలిగే జంతువులు మోసే ఒక జూనోటిక్ వైరస్. ఇది మనుషులకు అరుదుగా సోకుతుంది. కానీ సోకితే చాలా ప్రాణాంతకంగా మారుతుంది. అమెరికాలో వ్యాపించిన హంటావైరస్ కార్డియోపల్మోనరీ సిండ్రోమ్ అంటే ఊపిరితిత్తులు, హృదయాన్ని దెబ్బతీస్తుంది. యూరప్, ఆసియాలో ఈ వైరస్ ఎఫెక్ట్ కిడ్నీలను, రక్తనాళాలను దెబ్బతీసే హెమరేజిక్ జ్వరాన్ని కలిగిస్తుంది.

వ్యాప్తి ఎలా జరుగుతుందంటే..

సాధారణంగా హంటావైరస్ సంక్రమణ సోకిన ఎలుకల మూత్రం, విసర్జన లేదా లాలాజలంతో సంపర్కం ద్వారా జరుగుతుంది. అలాగే ఎలుక కరవడం వల్ల కూడా వ్యాపించవచ్చు. గాలి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. క్రూజ్ షిప్‌లో వ్యాపించిన వైరస్ Andes వైరస్ అని నిర్ధారించారు. ఇది ఒకే ఒక హంటావైరస్ వేరియంట్. ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించగలదు. కానీ అరుదుగా వ్యాపిస్తుంది. 

లక్షణాలు ఇవే

హంటావైరస్ సంక్రమణ మొదట జలుబుగా మొదలవుతుంది. తర్వాత అలసట, జ్వరం, కండరాల నొప్పి, వికారం, వాంతుల లక్షణాలు బయటపడతాయి. కొందరిలో ఇది తీవ్రమైన, ప్రాణాంతక శ్వాస సమస్యగా మారుతుంది. లక్షణాలు సాధారణంగా సంపర్కం తర్వాత 1 నుంచి 8 వారాల మధ్య మొదలవుతాయి. 

చికిత్స ఉందా?

హంటావైరస్‌కు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట మందు లేదు. వెంటిలేటర్ వంటి సపోర్టివ్ కేర్ అందుబాటులో ఉంటే ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే తొందరగా వైద్య సహాయం తీసుకోవాలని WHO స్పష్టం చేసింది.

అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. హంటావైరస్ కరోనా లాగా వేగంగా వ్యాపించదు. సాధారణ ప్రజలకు రిస్క్ చాలా తక్కువ. ముఖ్యంగా లక్షణాలు చూపించే వ్యక్తితో దగ్గరి, లైంగిక సంబంధం కలిగి ఉంటే మాత్రమే వ్యాపించే అవకాశం ఉంది.

 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Onion Samosa : ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
ఆనియన్ సమోసా రెసిపీ.. ఇంట్లోనే క్రిస్పీగా, టేస్టీగా ఇలా చేసుకోండి
Urine Leaking : తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా? ఈ సమస్యకు కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా? ఈ సమస్యకు కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
Hair Oils for Men : మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
మగవారికి జుట్టుకు ఏ ఆయిల్ మంచిది? హెయిర్ ఫాల్, పలుచబడిన జుట్టుకు ఇవి ట్రై చేయండి
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
Embed widget