అన్వేషించండి

Black Coffee : బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగుతున్నారా? ఇది లివర్ హెల్త్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?

Black Coffee Per Day : బ్లాక్ కాఫీని చాలామంది తాగుతారు. ఇంట్లో ఉన్నా.. ఆఫీస్​లో ఉన్నా బ్లాక్ కాఫీ లేనిదే పని జరగదు. మరి దీనిని ఎలా తాగితే మంచిది? కాలేయ ఆరోగ్యానికి ఇది ఎలా హెల్ప్ చేస్తుందో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మంచి నాణ్యమైన బీన్స్ తో తాజా బ్లాక్ కాఫీ తాగాలి.
  • బ్లాక్ కాఫీలో 1,000 పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలుంటాయి.
  • ఫ్యాటీ లివర్, సిర్రోసిస్, క్యాన్సర్ రిస్క్ బ్లాక్ కాఫీ తగ్గిస్తుంది.
  • రోజుకు 2-3 కప్పులు, శరీర తట్టుకునే శక్తిని బట్టి తాగాలి.

Black Coffee Healthy or Harmful : తల పగిలిపోతుంది అయితే బ్లాక్ కాఫీ.. ఆఫీస్ టెన్షన్ ఎక్కువైతుంది వెళ్లి బ్లాక్ కాఫీ తాగాలి.. టైమ్ పాస్ అవ్వట్లేదు బ్లాక్ కాఫీ తాగాలి.. పని నుంచి బ్రేక్ కావాలి అయితే బ్లాక్ కాఫీ తాగాలి.. ఇలా ప్రతీదానికి బ్లాక్ కాఫీని తాగే వ్యక్తిని మీ చుట్టు పక్కలా చూస్తూనే ఉంటాము. లేదా మీరు కూడా బ్లాక్ కాఫీ ఇష్టపడే వ్యక్తి కావచ్చు. మీరు దీనిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. మరి దీనిని ఎలా తీసుకోవాలి? ఎంతమోతాదులో తీసుకుంటే లివర్​పై ఎఫెక్ట్ పడకుండా ఉంటుందో.. నిపుణుల సూచనలు ఏంటో తెలుసుకుందాం. 

బ్లాక్ కాఫీ తయారీ కోసం.. 

మీరు మంచి, హెల్తీ కాఫీ తాగాలనుకుంటే మంచి నాణ్యమైన కాఫీ బీన్స్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్​గా గ్రైండ్ చేసి కాఫీ పెట్టుకుంటే మంచిది. కాఫీ మేకర్ లేదా ఫిల్టర్ ఉపయోగించి తయారు చేసుకోండి. పాలు, చక్కెర వేయకుండా తాగాలి. ఇదే బ్లాక్ కాఫీ. చాలామంది ఇన్‌స్టెంట్ కాఫీ పొడి ఉపయోగిస్తారు. కానీ అది మంచిది కాదు. ఎందుకంటే అందులో యాడిటివ్స్ ఉంటాయి. దీంతో పోషక విలువలు తగ్గుతాయి. 

బ్లాక్ కాఫీలో ఏముంటాయి..

ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ కాఫీ గురించి పోస్ట్ చేశారు. "బ్లాక్ కాఫీలో 1,000కు పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. మీరు 800 పెట్టి కొనే మల్టీవిటమిన్‌లో కేవలం 20 మాత్రమే ఉంటాయి. వాటితో పోలిస్తే బ్లాక్ కాఫీ చాలా బెటర్. ఈ సమ్మేళనాలు లివర్ కణాలను రక్షిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి.. అల్జీమర్స్ రిస్క్‌ను తగ్గిస్తుంది.

బ్లాక్ కాఫీ లివర్‌కు ఎందుకు మంచిది?

కాఫీలో కెఫిన్, క్లోరోజెనిక్ యాసిడ్స్, డైటర్పెన్స్, మెలనోయిడిన్స్ వంటి 1,000కు పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆక్సీడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవే లివర్ నష్టానికి ప్రధాన కారణాలు. ఫ్యాటీ లివర్ డిసీజ్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి సమస్యల రిస్క్‌ను బ్లాక్ కాఫీ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 

బ్లాక్ కాఫీ ప్రయోజనాలు

బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల లివర్​ ఆరోగ్యానికే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ రిస్క్ తగ్గుతుంది. మెటబాలిజం పెరిగి.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కెఫిన్ వల్ల అలసట తగ్గి మెదడు చురుకుగా పని చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

బ్లాక్ కాఫీ రోజుకు ఎంత తాగాలి?

వోక్‌హార్ట్ హాస్పిటల్స్ డాక్టర్ స్వప్నిల్ శర్మ ప్రకారం.. చాలా మందికి రోజుకు 2–3 కప్పులు తాగుతారు. ఇవి ఆరోగ్యానికి మంచిదే అనుకుంటారు. కానీ కెఫిన్‌ తట్టుకునే శక్తి ఒక్కొక్కరిలో వేరుగా ఉంటుంది. కాబట్టి మీ బాడీని బట్టి దీనిని తీసుకుంటే మంచిది. ముఖ్యంగా గర్భిణీలు, గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతనే బ్లాక్ కాఫీ తాగాలి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Scalp Oiling vs Hair Strand Oiling : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Embed widget