సమ్మర్లో పింపుల్స్ తగ్గించే సింపుల్ చిట్కాలు

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో చెమట, దుమ్ము ఎక్కువగా పేరుకుపోయి.. పోర్స్ మూసుకుపోయి పింపుల్స్ రావచ్చు.

రోజుకు రెండు నుంచి మూడు సార్లు మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవడం మంచిది.

శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటే టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. దీంతో పింపుల్స్ తగ్గే అవకాశం ఉంటుంది.

డీప్ ఫ్రైడ్, ఎక్కువ నూనె ఉన్న ఆహారం వేసవిలో స్కిన్‌ను మరింత ఆయిలీగా మార్చవచ్చు. దీంతో మొటిమలు పెరుగుతాయి.

చెమట ఎక్కువసేపు ముఖంపై ఉండిపోతే బ్యాక్టీరియా పెరిగి పింపుల్స్ రావచ్చు. క్లీన్ టవల్ లేదా టిష్యుతో మెల్లగా తుడవాలి.

వేసవిలో ఎండ వల్ల స్కిన్ ఇర్రిటేషన్ పెరిగి మొటిమలు రావచ్చు. ఆయిల్ ఫ్రీ, నాన్-కోమెడోజెనిక్ సన్‌స్క్రీన్ వాడటం మంచిది.

చేతులపై ఉండే దుమ్ము, బ్యాక్టీరియా ముఖానికి చేరి పింపుల్స్‌ను పెంచవచ్చు. అందుకే తరచుగా ముఖాన్ని టచ్ చేయకపోవడం మంచిది.

వాడిన టవల్స్, పిల్లో కవర్లలో బ్యాక్టీరియా పేరుకుపోవచ్చు. వీటిని తరచుగా ఉతికి మార్చడం స్కిన్ హెల్త్‌కు మంచిది.

అలోవెరా జెల్ స్కిన్‌ను కూల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో స్కిన్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికీ ఉపయోగపడొచ్చు.

నిద్ర సరిగా లేకపోతే హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు పెరిగే అవకాశం ఉంటుంది. రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి.