క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఫుడ్స్ ఇవే.. ఎక్కువగా తింటే ప్రమాదమే
Published by: Geddam Vijaya Madhuri
ప్రాసెస్డ్ మీట్స్‌లో ప్రిజర్వేటివ్స్, నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే క్యాన్సర్ ప్రమాదం పెరగొచ్చని పరిశోధనలు చెప్తున్నాయి.
చికెన్, మాంసం వంటివి ఎక్కువగా కాల్చి తింటే హానికర రసాయనాలు తయారవుతాయి. ఇవి శరీర కణాలను దెబ్బతీసే అవకాశం ఉంది.
బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు, కెమికల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, అధిక చక్కెర కలిగిన ప్యాకేజ్డ్ జ్యూసులు ఇన్ఫ్లమేషన్ పెంచి క్యాన్సర్లకు రిస్క్ ఫ్యాక్టర్‌గా భావిస్తారు.
మైదా, వైట్ బ్రెడ్, ప్యాకేజ్డ్ బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తింటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.
పికిల్స్, చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో అధిక ఉప్పు ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే కడుపు ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు.
నూనెను పదే పదే వేడి చేసి వాడటం వల్ల హానికర పదార్థాలు తయారవుతాయి. ఇవి శరీరానికి హానికరం కావచ్చు.
యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ తక్కువగా ఉన్న డైట్ వల్ల శరీరం హానికర ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి తగ్గుతుంది.
అధిక మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల లివర్, నోరు, గొంతు క్యాన్సర్లు ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.
కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉండే ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.