పైల్స్ రావడానికి కారణాలు ఇవే.. విస్మరించకండి

Published by: Geddam Vijaya Madhuri

మలబద్ధకం ఉంటే పైల్స్‌ వస్తాయి. మలం గట్టిగా మారి ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ భాగంలోని రక్తనాళాలు ఉబ్బి పైల్స్ సమస్య వస్తుంది.

పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ఫైబర్ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటే జీర్ణక్రియ సరిగా జరగదు. దీని వల్ల మలబద్ధకం పెరిగి పైల్స్ వస్తాయి.

ఆఫీస్ పనులు లేదా నిరంతరం కూర్చునే అలవాటు వల్ల బ్యాక్​పై ఒత్తిడి పెరిగి పైల్స్ సమస్యకు దారితీస్తుంది.

తగినంత నీరు తాగకపోతే మలం గట్టిపడుతుంది. దీంతో టాయిలెట్ సమయంలో ఒత్తిడి ఎక్కువై పైల్స్ సమస్య రావచ్చు.

ఒబేసిటీ ఉన్నవారిలో పైల్స్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. శరీర బరువు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి ఇబ్బంది కలుగుతుంది.

గర్భిణీల్లో గర్భాశయం ఒత్తిడి కారణంగా రక్తనాళాలు ఉబ్బుతాయి. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది పైల్స్ సమస్యతో ఇబ్బంది పడతారు.

అధికంగా స్పైసీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు పెరిగి పైల్స్‌కు కారణమవుతాయి.

శారీరక శ్రమ లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య పెరిగి పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

అధిక బరువులు ఎత్తే పనులు చేయడం వల్ల పొత్తికడుపుపై ఒత్తిడి పెరిగి గుద ప్రాంత రక్తనాళాలపై ప్రభావం పడుతుంది.

మొబైల్ చూస్తూ లేదా పేపర్ చదువుతూ టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి పెరిగి పైల్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఈ సమస్యలు గుర్తిస్తే.. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది.