కొవ్వు పెరుగుతోందా? కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ పెంచి గుండె సమస్యలకు దారితీస్తాయి.

రోజూ శారీరక శ్రమ లేకుండా కూర్చునే జీవనశైలి కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

బరువు ఎక్కువగా ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ప్రమాదకరం.

సిగరెట్ తాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గిపోతుంది. రక్తనాళాలు దెబ్బతిని గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి.

అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరిగి కొలెస్ట్రాల్ అసమతుల్యం అవుతుంది.

ఎప్పుడూ టెన్షన్‌లో ఉండటం వల్ల హార్మోన్ల ప్రభావంతో శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు పెరగవచ్చు.

కుటుంబంలో ఎవరికైనా కొలెస్ట్రాల్ సమస్య ఉంటే.. జన్యుపరంగా ఇతరులకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.

సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగి కొలెస్ట్రాల్ సమస్యకు దారితీస్తాయి.

వయస్సు పెరిగే కొద్దీ శరీర జీవక్రియ మందగిస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణ తప్పే అవకాశం ఉంటుంది.

మధుమేహం, థైరాయిడ్, లివర్ సమస్యలు ఉన్నవారిలో కూడా కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ.