మగవాళ్లు రోజూ చియా సీడ్స్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

చియా సీడ్స్‌లో ప్రోటీన్, మంచి కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి వెంటనే శక్తిని అందించి అలసట తగ్గించడంలో సహాయపడతాయి.

వ్యాయామం చేసే పురుషులకు చియా సీడ్స్ మంచి ఆహారం. ఇందులో ఉండే ప్రోటీన్ కండరాల పెరుగుదల, రికవరీకి సహాయపడుతుంది.

వీటిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

చియా సీడ్స్ నీటిలో నానబెట్టినప్పుడు ఉబ్బిపోతాయి. దీంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గుతారు.

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గి గట్ హెల్త్ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.

ఫిట్‌నెస్, జిమ్, స్పోర్ట్స్ చేసే పురుషులకు చియా సీడ్స్ మంచి సూపర్ ఫుడ్‌గా భావిస్తారు. ఇవి శరీర సహనశక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.

చియా సీడ్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఎముకల బలాన్ని పెంచుతాయి.

చియా సీడ్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెరగనివ్వవు. డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా, జుట్టు బలంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి.

చియా సీడ్స్‌లో ఉండే మెగ్నీషియం నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. దీంతో మానసిక ఒత్తిడి, అలసట తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.